ప్రభుత్వ ఉద్యోగం అంటే జీవితానికి ఒక భరోసా. ప్రభుత్వ ఉద్యోగాలు పడుతున్నాయంటే చాలు లక్షల మంది అభ్యర్థులు అప్లికేషన్లు పెట్టి పరీక్షలకు హాజరవుతూ ఉంటారు. సంవత్సరాలు తరబడి కోచింగ్ సెంటర్ లో ప్రిపేర్ అవుతూ తమ కల నెరవేర్చుకోవాలని ఎదురు చూస్తూ ఉంటారు.తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రయత్నిస్తున్న అభ్యర్థుల సంఖ్య ఎక్కువగానే ఉంది.
అయితే, బీబీసీ తెలుగు చేసిన ఒక ఇంటర్వ్యూలో 2014 నుండి తాము గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నామని ఇప్పటికే రెండుసార్లు ఎగ్జామ్ క్యాన్సిల్ చేశారని తాజాగా మూడోసారి కూడా క్యాన్సిల్ చేసి తమకు నిరాశ కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తాము చదువులు కోసం బంగారాలు తాకట్టు పెట్టి కష్టపడుతున్నా కానీ తమ బతుకులు మాత్రం మారడం లేదని నిరుద్యోగులను పట్టించుకునే నాయకుడే లేరని ఆవేదన చెందుతున్నారు.
సంవత్సరాలు తరబడి ఇక్కడే గడిపేస్తున్నాం వయసులైపోతున్నాయి తమకి పెళ్లి కూడా అవడం లేదని బాధపడుతున్నారు.తెలంగాణలో ఎంతోమంది నిరుద్యోగులు గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. తాము ఖర్చులకోసం ఇంట్లో డబ్బులు అడగలేక అప్పులు చేయలేక ఇక్కడ గడుపుకోలేకపోతున్నామని ఏ దిక్కు లేక ఐదు రూపాయల భోజనం తిని బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కోచింగ్ సెంటర్ లో ఉండి ప్రిపేర్ అవ్వడానికి తమకి నెలకి పదివేల రూపాయలు దాకా అవుతుందని అంటున్నారు.కనీసం ప్రభుత్వం నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం లేదని అంటున్నారు.తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిసారి 2022లో 503 గ్రూప్ వన్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా 2,33,247 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. 2022 అక్టోబర్ లో ఈ పరీక్ష జరగగా పేపర్ లీక్ అవడం వల్ల రద్దు చేసి మళ్ళీ 2023 జూన్ లో పరీక్ష పెట్టారు.
అయితే బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకొని కారణంగా ఆ పరీక్షను కూడా రద్దు చేయాలని హైకోర్టు ఆదేశించింది. మళ్ళీ ఈ పరీక్ష ఎప్పుడు జరుగుతుందనే దానిపై స్పష్టత లేదు.ఇలా పరీక్షలు రద్దు చేస్తూ ఉంటే విద్యార్థులు తమ కాన్ఫిడెన్స్ కోల్పోతారని అంటున్నారు. నవంబర్లో కొన్ని పరీక్షలు జరగాల్సి ఉండగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వాటిని మళ్లీ జనవరి కి వాయిదా వేశారు. దీని కారణంగా విద్యార్థులు నిరాశ చెంది సూసైడ్ పాల్పడుతున్నారని చెబుతున్నారు.
Watch Video:
ALSO READ : సైడ్ డాన్సర్ గా కెరీర్ మొదలు… నమ్మిన వాళ్ల చేతిలోనే మోసం..! “సూర్యకాంతం” కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు..!