Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ 6 చివరి దశకి వచ్చేసింది. ఇక 13వ వారంలో ఫైమా ఎలిమినేట్ అయ్యింది. వాస్తవానికి ఫైమా లాస్ట్ వారం ఎలిమినేట్ కావల్సింది. అయితే ఫైమా దగ్గర ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉండటంతో సేఫ్ అయ్యి, ఆమె బదులుగా రాజ్ ఎలిమినేట్ అయిపోయాడు.
ఇక ఫైమా ఒక వారం ఆలస్యంగా ఎలిమినట్ అయ్యింది. ఇక బిగ్ బాస్ గేమ్ మార్చాలనుకున్న ఆడియన్స్ మాత్రం ఓట్లు వేయడంలో కనికరం చూపించరు. ఆడియన్స్ ఎవర్ని బిగ్ బాస్ హౌస్ లో ఉంచాలి అనుకుంటే వారినే ఉంచుతారు. దాంతో 13వ వారం ఫైమా తప్పించుకోలేక ఎలిమినేట్ అయ్యింది. ఇక హౌస్ నుంచి ఎలిమినట్ అయిన కంటెస్టెంట్లు ఇంటర్వ్యూలు ఇస్తూండడం, వాటిలో షో పై రకరకాలుగా మాట్లాడటం వంటివి బిగ్ బాస్ మొదలైనప్పటి నుండి కనిపిస్తూనే ఉన్నాయి. ఇక బయటకు వచ్చిన ఫైమా అదే విధంగా చేస్తుందా లేదో చూడాలి.ఫైమా ఎలిమినేట్ అవడంతో ఆమె ఎంత పారితోషికం తీసుకుంది అనే విషయం పై చర్చలు స్టార్ట్ అయ్యాయి. ఫైమా స్టార్టింగ్ లో బలమైన కంటెస్టెంట్లానే అనిపించింది. హౌస్లో కంటెస్టెంట్స్కి సంబంధించిన విషయాలు అన్ని తెలిసిపోతాయి. కానీ వాళ్ల పారితోషికం గురించి చర్చించుకోరు. కానీ బయటకు వచ్చినా కూడా వాళ్ల రెమ్యూనరేషన్ గురించి చెప్పరు. ఎందుకంటే బిగ్ బాస్ షో అగ్రిమెంట్లో వారి పారితోషికం వివరాల గురించి తెలపకూడదని నిబంధన ఉంటుంది. తాజాగా ఫైమా పారితోషికం హాట్ టాపిక్ గా మారింది. ఆమె 13 వారాలు హౌస్లో ఉండటంతో భారీగానే పారితోషికం అందుకుందని రూమర్స్ వస్తున్నాయి.13 వారాలకు గానూ, 22 లక్షలు అందుకుందని టాక్ వినిపిస్తోంది. అంటే ఆమె వారానికి 1, 75, 000 పారితోషికం తీసుకుంది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ లో వారానికి 1,70, 000 ఇప్పటివరకు జరిగిన సీజన్లలో ఏ కంటెస్టెంట్కి కూడా ఇవ్వలేదని, దాన్ని బట్టి చూస్తే ఫైమాకి ఒక వారానికి 25,000-30,000 ఇచ్చి ఉండవచ్చు అని ఇంతకు ముందు బిగ్ బాస్ కి వెళ్లొచ్చిన వారు చెప్తున్నారు. వారి చెప్తున్న లెక్కన చూస్తే ఫైమాకి 13 వారాలకు కలిపి 3,90,000 మాత్రమే అవుతుందని మరో టాక్.