heroine Raasi family details: 1980లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయమై తన నటనతో అందరి చేత ఫుల్ మాక్స్ వేయించుకున్న రాశి ఆతరువాత తన తండ్రి కోరిక మేర తెలుగు,తమిళ్,హిందీ భాషలలో హీరోయిన్ గా రాణించారు.అప్పట్లో రాశి నటనకు ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యేవారు.అలాంటి రాశి సడన్ గా పెళ్లి చేసుకొని చాలాకాలం పాటు అటు సినిమాలకు,ఇటు మీడియాకు దూరంగా ఉంటూ వచ్చారు.అలాంటి రాశి గారి లవ్ స్టోరీ గురించి ఆమె పెళ్లి గురించి ఆసక్తికర విషయాలను ఇప్పుడు చూద్దాం.
తండ్రి కోరిక మేర హీరోయిన్ గా సినిమాల్లోకి అడుగుపెట్టిన రాశి.తన నటన,అందంతో అందరినీ ఆకట్టుకున్నారు. అలా ఎనిమిదేళ్లు టాప్ హీరోయిన్ గా కొనసాగిన రాశి. అవకాశాలు తగ్గిపోవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.ఈ టైంలో రాశి గారికి వందల కోట్ల ఆస్తి ఉన్నవాళ్ళ సంబంధాలు వచ్చాయి.కాని వాటన్నిటినీ తిరస్కరించిన రాశి ఒక సహాయక దర్శకుడిని పెళ్లి చేసుకొని హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు.
ఇంతకీ ఆ సహాయక దర్శకుడు ఎవరంటే శ్రీ ముని.ఈయన రాశి నటించిన పలు చిత్రాలలో సహాయక దర్శకుడిగా పని చేశారు.అక్కడ పరిచయమైన వారు మంచి స్నేహితులుగా మారారు. నాకు సంబంధాలు చూస్తున్న సమయంలో మా తండ్రిగారు చనిపోవడంతో నేను నా బాధను శ్రీ మునితోనే పంచుకున్నానని రాశి గారు అన్నారు.అలాగే స్వయంగా తాను కొద్దిరోజులు గడిచాక నన్ను పెళ్లి చేసుకుంటావా అని శ్రీమునిని అడిగారట.దానికి శ్రీ ముని కూడా సరే అనడంతో ఇద్దరు ఇరువైపు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నట్లు ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. heroine Raasi family details
also read : అందులో మా అమ్మ ఫోటోలు, వీడియోలు ఉన్నాయి…దయచేసి ఇచ్చేయండి అంటూ అమ్మాయి లేఖ.!