ప్రపంచంలో అప్పుడప్పుడు అనుకోని వింతలు జరుగుతూ ఉంటాయి. అవి ఎందుకు జరిగాయో ఎలా జరిగాయో అనేది మాత్రం కనిపెట్టడం చాలా కష్టం. అలా మరుగున పడ్డ విషయాలు ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. దాన్ని సైన్స్ కూడా పట్టుకోలేకపోతోంది. ఇలాంటి అద్భుత ఘటనల్లో మంచి జరిగితే దాన్ని అద్భుతమని, చెడు జరిగితే శాపమని అంటారు. కానీ ఇక్కడి పల్లెటూర్లో మాత్రం శాస్త్రవేత్తలకు కూడా అంతుచిక్కని ఒక వింత ఘటన చోటు చేసుకుంది. అయితే ఆ ఊరిలో గత 12 సంవత్సరాలుగా ఒక మగబిడ్డ కూడా పుట్టలేదట.
దానికి కారణం ఏంటి అన్నది ఇప్పటి వరకు కూడా ఎవరికీ తెలియదని అంటున్నారు. ఇన్నేళ్ళుగా మగ పిల్లాడు పుట్టినీ ఊరు ఏంటని తలలు పట్టుకుంటున్నారు శాస్త్రవేత్తలు.. ఇది ఒక నమ్మలేని నిజం.. పెద్ద పెద్ద సైంటిస్టులు కూడా ఈ రహస్యాన్ని ఇప్పటివరకు చేధించలేక పోయారంటే దాని వెనుక ఉన్న రహస్యం ఏంటో అర్థం కావడం లేదు.
ఈ గ్రామం పోలాండ్ లో ఉంది. ఇక్కడ స్థిర పడ్డ మిజేస్కె ఒడ్జెన్సకి అనే గ్రామంలో 12 సంవత్సరాలుగా ఒక అబ్బాయి కూడా పుట్టలేదు. అక్కడ ఎవరు గర్భందాల్చిన ఆడపిల్లలు పుట్టడం చాలా విశేషం. అయితే ఈ గ్రామంలో కొడుకు పుడితే మాత్రం వారికి పారితోషికం ఇస్తామని 2019లో ఈ గ్రామంలో ప్రకటించినట్లు తెలుస్తున్నది. అయితే ఈ పారితోషికం కూడా ఇప్పటి వరకు ఎవరికీ అంత లేదు.
ఈ విషయం మొదటగా బయటకు వచ్చినప్పుడు శాస్త్రవేత్తలు నమ్మలేదు. తర్వాత వారు స్వయంగా గ్రామానికి వచ్చి సెర్చ్ చేసి నిజమేనని తెలియజేశారు. ఈ గ్రామంలో ఎంతో మంది జర్నలిస్టులు వచ్చి దీనిపై రిపోర్ట్ చేశారు కానీ రహస్యాన్ని ఛేదించలేకపోయారు. ఈ గ్రామంలో 200 మంది నివసిస్తున్నారు. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో త్వరలో తెలియజేస్తామని శాస్త్రవేత్తలు కూడా అంటున్నారు.