కరోనా కరోనా కరోనా..దీని పేరు వింటేనే అరి కాళ్ళ నుంచి వణుకు పుడుతుంది. రెండు సంవత్సరాల పాటు ప్రపంచవ్యాప్తంగా కల్లోలం సృష్టించి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. దీని దాటికి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కూడా కుదేలయిపోయాయి. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఎంతో మంది చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా మిగిలారు.
వైరస్ బారిన పడి లక్షల మంది మరణించారు. కరోనా కాటు వేసిన కుటుంబాలు ఇప్పటికి కూడా కోలుకోకుండా అయిపోయాయి అంటే దాని ప్రభావం ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే తగ్గుముఖం పట్టింది అనుకున్న సమయంలో మళ్లీ కరోనా నుంచి ఒక బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తుంది. అది ఏంటో చూద్దాం..!
కరోనాపై ఎన్నో రోజులుగా రీసెర్చ్ చేస్తున్న ఐఐటి బొంబాయి మరో షాకింగ్ విషయాన్ని బయట పెట్టింది. కరోనా సోకిన పురుషుల్లో సంతానోత్పత్తి తగ్గుతుందని అధ్యయనంలో తేలింది. ఈ రికార్డును జాస్లాక్ హాస్పిటల్ మరియు ఐఐటీ ముంబై సైంటిస్టులు కలిసి సంయుక్తంగా నిర్వహించారు. కరోణా బారినపడి కోలుకున్నటువంటి పురుషులపై వీరు పరిశోధన చేసి ఈ విషయాలను బయటపెట్టారు. మైల్డ్ లక్షణాలతో కరోణా సోకి.. బయటపడ్డ వారిలో సంతానానికి సంబంధించిన ప్రోటీన్లు దెబ్బతింటాయని ఈ అధ్యయనంలో తెలియజేశారు. దీన్ని పురుషుల యొక్క వీర్యకణాల పై రీసెర్చ్ చేసి ఏసిఎస్ ఒమేగా జర్నల్ లో ప్రచురితం చేశారు.
కరోనా వైరస్ కు కారణమైన సార్స్ -2 వైరస్ ముఖ్యంగా శ్వాసకోశ వ్యవస్థ పై దెబ్బతీస్తుందని.. దీనితో పాటుగా ఇతర వ్యవస్థలను కూడా పాడు చేస్తుందని వారంటున్నారు. అంతేకాకుండా పురుషుల సంతానోత్పత్తికి కూడా అడ్డుపడతాయని అన్నారు. ఈ పరిశోధన పదిమంది కరోనా సోకని ఆరోగ్యవంతమైన పురుషుల మీద, మరియు 17 మంది కరోనా సోకి రికవరీ అయిన వారిపై చేశారు. ఆరోగ్యవంతమైన వ్యక్తులతో పోల్చగా, కరోనా సోకిన వ్యక్తుల్లో సంతానానికి సంబంధించిన సెమినోజెలిన్ 1, ప్రొసఫోపిన్ అనే ప్రోటీన్లు తక్కువగా ఉన్నట్లు తేలిందని సైంటిస్టులు చెబుతున్నారు.