Tollywood: గత కొద్ది రోజులుగా హీరో నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ పై వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశం కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నారని టాక్.
అయితే మోక్షజ్ఞ ఎంట్రీ పై ఇంతకుముందు వినిపించిన వార్తలన్నీ రూమర్స్ అని తెలిపోయాయి. మోక్షజ్ఞ సినీ ఎంట్రీ పై ఇంతవరకు సరైన క్లారిటీ రాలేదు. మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వకపోవడానికి కారణం శరీరంలో వచ్చిన కొన్ని మార్పులే అని రక రకాలుగా రూమర్స్ వచ్చాయి. తాజాగా మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో హాల్ చాల్ చేస్తోంది.
గోవాలో జరుగుతోన్న 53వ అంతర్జాతీయ చలన చిత్ర ఉత్సవాల్లో పాల్గొన్న దర్శకుడు బోయపాటి చేసిన వాఖ్యలను బట్టి నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ పై క్లారిటీ వచ్చిందని తెలుస్తోంది. బోయపాటి మాట్లాడిన సమయంలో బాలకృష్ణ కూడా పక్కనే ఉన్నారు. మోక్షజ్ఞని మీరే పరిచయం చేస్తారా అని ప్రశ్నించగా బోయపాటి అవునని కానీ, కాదని కానీ చెప్పకుండా, అతన్ని సిని పరిశ్రమకి ఎలా, ఎప్పుడు పరిచయం చేయాలి అని వారి కుటుంబానికి కూడా ఒక ప్లాన్ ఉంటుంది. మోక్షజ్ఞకి ఏ డైరెక్టర్ సెట్ అవుతాడు. అతని బాడీ లాంగ్వేజ్,ఇమేజ్ కి ఎలాంటి స్టోరీ అయితే సెట్ అతనే లాంచ్ చేస్తాడని బోయపాటి అన్నారు.
ఇంకా మాటాడుతూ నేనే పరిచయం చేస్తానని చెప్పలేను.ఆ సమయం వస్తే, ఎంట్రీ అలా జరిగిపోతుంది. మన చేస్తుల్లో ఏం లేదు, అంతా దైవేచ్చ. ఆ అప్పటిదాకా మనమంతా ఎదురుచూడాలి అని మోక్షజ్ఞ ఎంట్రీ గురిచి చెప్పారు. పక్కనే ఉన్న బాలయ్య చిన్నగా నవ్వాడు.కానీ ఏం మాట్లాడలేదు. ప్రస్తుతం బోయపాటి రామ్ పోతినేని హీరోగా పాన్ ఇండియా సినిమాని తీస్తున్న సంగతి తెలిసిందే. హీరో నందమూరి బాలకృష్ణ తన 107వ చిత్రం వీరసింహారెడ్డితో సంక్రాంతి పండుగాకి బరిలోకి దిగుతున్నారు.