మనం ఇల్లు కట్టుకున్న, వాస్తు దోషాలు లాంటివి చూస్తూ ఉంటాం. వాస్తు అనే పదం మాత్రమే మనకు తెలుసు.. మరి దాని వెనుక రహస్యాలు, ఏంటో మనం ఆలోచించం. కానీ కొన్ని విషయాలలో ఇది తప్పక పాటించాల్సిందే. అదే జిమ్ విషయానికి వస్తే జిమ్ సెంటర్లను ఎక్కువగా మొదటి అంతస్తులోనే నెలకొల్పుతారు. గ్రౌండ్ ఫ్లోర్ లో మాత్రం పెట్టరు. దానికి ప్రధాన కారణం ఏంటో తెలుసుకుందాం..?
దుబాయిలో జిమ్ కు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల జిమ్ సెంటర్లకు పోటీ కూడా పెరిగిపోయింది. మిగతా వ్యాపారాల లాగా జిమ్ సెంటర్ల యాజమాన్యాలు సోషల్ మీడియా మరియు టీవీ ఛానల్లో ప్రకటనలు ఇచ్చుకోవడం వంటి పనులు చేయరు. ఎందుకంటే జిమ్ సెంటర్లకు స్థానికులే బలం. దూర ప్రదేశాలనుండి ఎవరూ రారు. కాబట్టి జిమ్ యాజమాన్యాలు ప్రకటనల కోసం పెద్దగా ప్రయత్నం చేయడానికి ఆస్కారం లేదు. వారు ఏర్పాటు చేసే బోర్డులే జిమ్ అక్కడ ఉందని తెలియజేస్తుంది.
అందుకోసమే మొదటి అంతస్తులో జిమ్ పెడితే మొత్తం స్పీకర్లతో, జిమ్ ఉందనే సంకేతాలు ఇచ్చే ఫోటోలతో పదిమందికి తెలిసి పోయే ఆస్కారం ఉంటుంది. మొదటి అంతస్తులో రాసింది ఏదైనా సరే దగ్గరగా మరియు దూరంగా ఉన్న వారికి కూడా కనిపిస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్ లో పెడితే తొందరగా కనిపించవు. ఇక రెండవ కారణం జిమ్ చేస్తున్న వారికి మంచి వ్యూ పాయింట్ ఉంటుంది. లిమిటెడ్ న్యూ పాయింట్ ఉంటే జిమ్ చేసే వాళ్ళకి అంతగా అనుభూతిని కలిగించకపోవడమే కాకుండా, వాహనాల శబ్దాల వల్ల డిస్టర్బ్ అవుతుంది. పై అంతస్తులో అయితే ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా జిమ్ లను ఫస్ట్ ఫ్లోర్ లోనే పెడతారు.