మనం ఏదైనా పని చేయాలంటే కృషి పట్టుదల కార్యదీక్ష, వీటన్నిటినీ మించి ఓపిక అనేది చాలా అవసరం. వీటిని అలవర్చుకొని కష్టానికి ఎదురెళ్లితే మనం సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. అలా ఎంతో మంది నిరుపేద స్థాయి నుంచి ధనవంతులు అయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొంతమంది మా అమ్మానాన్నలు మాకు బాగా సంపాదించలేదు, వాళ్లు వేస్ట్ అంటూ రోడ్లపై వదిలేస్తున్నారు. కొంతమంది అన్నీ ఉన్నా సోమరిపోతుల్లా తయారై నాకు అదృష్టం బాగా లేదంటూ సాకులు చెబుతూ ఉంటారు. కానీ ఈ మాటలు కడుపు నింపవు.మనం ఏది చేసినా మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తే దానికి తగ్గట్టు ఫలితం వస్తుంది. మనం ఏది మొదలు పెట్టిన ప్రారంభంలోనే లాభాలు అనేవి రావు.
కాస్త ఓపికతో సమన్వయంతో పనిచేయాలి. అప్పుడే మనకు ఫలితం వస్తుంది. అయితే ఈ యువకుడు కూడా ఇలాంటి ఫార్ములానే పాటించి పేదరికాన్ని రూపుమాపి ఏడాదికి రెండు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. మరి ఆ యువకుడు ఎవరు.. అతని సక్సెస్ వెనుక చరిత్ర ఏంటో తెలుసుకుందాం..!
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమ్రేహ ప్రాంతానికి చెందిన యువకుడు హార్వెంద్ర సింగ్ కుటుంబం వ్యవసాయంపై ఆధారపడిన పేద కుటుంబం. కానీ హరేంద్ర బాగా చదివి ఉద్యోగం చేసి సంపాదించాలని కలలుకన్నాడు.2007లో ఇంటర్ పూర్తి చేసి ఇంజనీరింగ్ చేయడం కోసం లక్నోలోని ఒక విద్యా సంస్థలో చేరాడు. అడ్మిషన్ కోసం 50 వేల రూపాయలు కూడా కష్టపడి కట్టాడు.కానీ ఆ కాలేజీ ఫేక్ అని తెలియడంతో, మళ్లీ మరో కాలేజీలో చేరడానికి డబ్బులు లేక తన చదువును ఆపేశాడు. వేరే ఉద్యోగంలో చేరాడు. ఇంతలో 2009 సంవత్సరంలో పెళ్లయింది. బాధ్యతలు మీద పడ్డాయి. ఖర్చులు పెరిగిపోయాయి. కుటుంబం గడవడమే కష్టంగా మారింది.
దీంతో హర్యానా లో ఉన్న తన సోదరుని వద్దకు వెళ్లి మూడువేల రూపాయల జీతానికి వివిధ పనులు చేస్తూ జీవనం సాగించాడు. కానీ సరిపోలేదు. జీవితంలో ఏదో పోగొట్టుకున్నాను అనే ఆవేదన వెంటాడుతోంది. ఎలాగైనా వ్యాపారం చేసి డబ్బు సంపాదించాలనుకుంటున్నాడుతన సోదరుడితో కలిసి 2016లో ఇంటికి వచ్చేశాడు.చేపల పెంపకం మొదలుపెట్టాడు. హార్వెంద్ర ను చూసి అందరూ హేళన చేశారు. అవేవి పట్టించుకోకుండా ప్రభుత్వ భూములు లీజుకు తీసుకొని చేపల పెంపకాన్ని ప్రారంభించాడు. మొదటి సంవత్సరం లోనే అనేక లాభాలు వచ్చాయి. తర్వాత నాలుగు ఎకరాల్లో చేపల పెంపకం మొదలు పెట్టాడు. కష్టించి పని చేస్తూ ఇంకా లాభాలు తెచ్చుకున్నాడు.
ప్రస్తుతం 16 ఎకరాల్లో విస్తరించాడు. ఇక ఆయన వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయల లాగా మారింది. ఆయన చేపపిల్లలను కోల్ కత్తా నుంచి తెప్పిస్తారు అని చెబుతున్నాడు. ఈ విధంగా ఆయన ఆదాయం ఏడాదికి రెండు కోట్ల రూపాయలు వస్తుందని అంటున్నాడు. ఆయనను చూసి చాలా మంది రైతులు అతని దగ్గర నేర్చుకోవడానికి వస్తున్నారు. వారి దగ్గర కొంత మొత్తాన్ని తీసుకొని సలహాలు సూచనలు కూడా ఇస్తుంటాడు. ఏది ఏమైనా కృషి,పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలం అని హార్వెంద్ర ను చూస్తే అర్థమవుతుంది.