మానవ జీవితం ఎంతో విలువైనది. మనం ఈ చిన్న జీవితాన్ని ఏ విధంగా మలచుకుంటే అలా తయారవుతుంది. ప్రస్తుత కాలంలో ఎంతోమంది సంపాదనే లక్ష్యంగా పెట్టుకొని తమ విలువైన జీవితాన్ని, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. మానవ జీవితంలో మనం పాటించాల్సిన కొన్ని సత్యాలు రహస్యాలు కూడా ఉన్నాయి. మరి అవేంటో ఒకసారి చూద్దాం..! మానవ సమాజంలో మనుషులంతా ఒక రకంగా ఉండరు. కొంతమంది వారికి తెలిసిన విషయాలను ఇతరులతో షేర్ చేసుకుంటారు. కొంతమందేమో మనసులోనే దాచుకుంటారు.
ఇందులో కొన్ని మంచి విషయాలు ఉండవచ్చు లేదా చెడు విషయాలు ఉండవచ్చు. అయితే మంచి విషయాలను షేర్ చేసుకోవడంలో తప్పులేదు. కానీ మన జీవితంలో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఇతరులతో మాత్రం అస్సలు షేర్ చేసుకోకూడదు. దీనివల్ల మన లైఫ్ లో జరిగేటువంటి కొన్ని విషయాలు వారికి ముందుగానే తెలిసిపోతాయి. ఆ విషయాలు మంచివైతే ఎలాంటి సమస్య ఉండదు, కానీ చెడు అయితే మాత్రం అన్ని సమస్యలు ఎదురవుతాయి. మన యొక్క చెడు విషయాలు తెలిస్తే మనం ఇతరులకు చులకన అవుతాం. వారు మనకి విలువ ఇవ్వరు. కాబట్టి మనం ఈ విషయాలను వారితో చెప్పకపోతే మన పై వారికి మంచి అభిప్రాయాన్ని సంపాదించుకోవచ్చు.
మన గోల్స్ : చాలామంది జీవితంలో ఏదో ఒక గోల్ పెట్టుకొని ముందుకు పోతూ ఉంటారు. మన మనసులో ఉన్నటువంటి మన లక్ష్యం ఇతరులకు చెబితే దాన్ని సాధించాలనే పట్టు తగ్గిపోతుందని సైకియాట్రిస్ట్ లు చెబుతూ ఉంటారు.
ఇతరుల గురించి చెడుగా మాట్లాడకూడదు : మనం ఎప్పుడైనా సరే ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం వల్ల, మంచి అనుభూతి కలగవచ్చు కానీ, ఇవి చెప్పడం వల్ల మన క్యారెక్టర్ ఎలాంటిదో వారు అంచనా వేస్తారు. దీంతో మి బిహేవియర్ ఎలాంటిదో ఇతరులకు తెలిసిపోతుంది. ఇతరుల గురించి చెడుగా మాట్లాడే వ్యక్తులను ఎవరు కూడా నమ్మరు. వారు మీతో ఏదైనా విషయం చెప్పాలంటే భయపడతారు. ఎందుకంటే మీరు మళ్లీ వేరే వాళ్లకు చెబుతారేమోనని అనుకుంటారు.
కుటుంబ సమస్యల గురించి చెప్పకూడదు:మన ఫ్యామిలీలో అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. అది భార్యాభర్తల మధ్య కావచ్చు, ఇతర కుటుంబ సభ్యుల మధ్య కావచ్చు. ఎందుకంటే కుటుంబ వివాదాలు అనేవి కొంత సమయం గడిస్తే వాటంతట అవే సద్దుమణిగి పోతాయి. కుటుంబ విషయాలను బయట వారికి చెబితే మీ మనసు కాస్త తేలిక అయినా కానీ మీరు మీ ఫ్యామిలీలో ఎవరి గురించి చెబుతారో, వారు మళ్ళీ వారికి చెప్పే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సమస్యల గురించి ఎవరికీ చెప్పకూడదు.
మీ బ్యాంకు వివరాలు:మన బ్యాంకు సంబంధించినటువంటి లావాదేవీల విషయాలను ఇతర వ్యక్తులకు అసలు చెప్పకూడదు. ఇవి చెప్పడం వల్ల కొంతమంది క్రైమ్ నేపథ్యం ఉన్న వ్యక్తులు మనల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మన దగ్గర డబ్బులు ఉన్నాయని వారికి తెలిస్తే కావాలని డబ్బులు అడిగి, మనం ఇవ్వకపోతే మనల్ని చెడ్డవారిగా భావిస్తారు. కాబట్టి ఇవి చెప్పకూడదు.
సీక్రెట్ పాస్వర్డ్ : ప్రస్తుతం టెక్నాలజీ పెరిగినా తరుణంలో ప్రతి ఒక్కటి ఆన్లైన్ ద్వారానే చేస్తున్నాం. దీనికి సపరేట్ గా పాస్వర్డ్ అనేది ఉంటుంది. మనకు మాత్రమే సీక్రెట్ గా చెబుతారు. ముఖ్యంగా ఏటీఎం పిన్ కానీ, మొబైల్ పాస్వర్డ్ కానీ ఇతరులకు చెబితే మనకు ఏదో రకంగా సమస్య రావచ్చు. కాబట్టి పాస్వర్డ్ అనేది ఎవరికీ చెప్పకూడదు.