ప్రస్తుతం అరచేతిలోనే అందలాన్ని చూసే టెక్నాలజీ వచ్చింది. ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో మనకు తెలిసిపోతుంది. మనం ఏది కావాలన్నా ఏ విషయం తెలుసుకోవాలన్నా నిమిషాల్లో జరిగిపోతుంది. ఇంత డిజిటల్ ప్రపంచంలో ఇంటర్నెట్ ను యూస్ చేయనీ గ్రామం అంటూ లేదు.. ప్రభుత్వాలు కూడా డిజిటల్ ఇండియా కొరకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. దీనికోసం యూట్యూబ్,గూగుల్, ఫేస్బుక్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ బింగ్, ఇలాంటి సంస్థల సెర్చ్ ఇంజన్లు ఉన్నప్పటికీ చాలా మంది గూగుల్ ప్లేస్టోర్ ద్వారానే ప్రతిదీ సెర్చ్ చేస్తారు. దీంతో అక్కడ ఏది సెర్చ్ చేసినా ఏం కాదులే అనుకోవడం మన పొరపాటు.. కాలం మారింది.. డిజిటల్ ప్రపంచం పెరిగింది.. దీంతోపాటుగా ఆన్లైన్ మోసాలు కూడా అనేకం వచ్చాయి.. దీంతో ఈ ఇంటర్నెట్ లో కూడా కొన్ని విషయాలను సెర్చ్ చేయాలంటే కొన్ని ప్రత్యేకమైన పర్మిషన్ తీసుకోవాలి. అలా కాకుండా సెర్చ్ చేస్తే మాత్రం జైలుకెళ్లడం, ఊచలు లెక్కించడం ఖయం..?#1 బాంబుల తయారీ
మనకి ఇంటర్నెట్ అందుబాటులో ఉంటే ఏదో ఒకటి గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటాం. ఇందులో ముఖ్యంగా బాంబుల గురించి బ్రౌజింగ్ చేస్తే ఇబ్బందుల్లో పడ్డాట్టే. ఇలాంటి విషయాలను వెతికిన వారిని సంస్థలు గుర్తు పట్టేస్తాయి. దీని ద్వారా వారికి జైలు శిక్ష పడే అవకాశం ఉంది.#2 అబార్షన్
అలాగే గూగుల్ లో అబార్షన్ ఎలా చేయాలి అనే విషయాన్ని వెతికితే మాత్రం తిప్పలు తప్పవు. గర్భస్రావాలు నిరోధించడం కోసం భారత్ గట్టి చట్టాలను రూపొందించింది. దీనికి సంబంధించినటువంటి కంటెంట్ ను సెర్చ్ చేస్తే భారతీయ చట్టాల ప్రకారం శిక్షార్హులు అవుతారు. దీన్ని డాక్టర్ అనుమతితోనే చేయాలని అంటున్నారు.
#3 చైల్డ్ పోర్న్
గూగుల్లో చిన్నారులకు సంబంధించి పోర్న్ వీడియోల గురించి వెతికితే ఫోక్సో చట్టం ప్రకారం జైలుకు వెళ్లడం ఖాయం. ఈ నేరం కింద ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నది.