మనం నీటిని విచ్చలవిడిగా వాడటం వల్ల భూగర్భ జలాలు తగ్గిపోతుంటాయి. ఈ తరుణంలో నీటి కరువు ఏర్పడుతుంది. దీంతో రైతులు బోర్లు వేయడం ప్రారంభిస్తారు. ఈ విధంగా చాలామంది ఒక ఊరిలో 300 నుంచి 400 బోర్లు వేసిన సందర్భాలు కూడా ఉంటున్నాయి.
దీన్ని ఆసరాగా చేసుకున్న కొంతమంది నీళ్ళు ఎక్కడ పడతాయో చూసి చెబుదామని బోర్ పాయింట్ సరిగ్గా చెబుతానంటూ వారి దగ్గరికి వెళ్తారు. ఈ విధంగా వారు మాత్రం ఒక కొబ్బరి కాయ ద్వారా బోర్ పాయింట్ చూస్తారు.
ఇది తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా జరుగుతున్న తంతు. కొబ్బరికాయను అరచేతిలో పట్టుకొని మనకు ఉన్నటువంటి స్థలంలో తిరుగుతూ ఉంటారు. ఈ క్రమంలో ఏదో ఒక దగ్గర కొబ్బరికాయ పైకి లేస్తుంది. దీంతో అక్కడ నీళ్ళు ఉన్నాయని వారు డిసైడ్ చేస్తారు. మరి కొబ్బరికాయ ఎందుకు నిలబడుతుంది.. మళ్లీ ఎందుకు పడుకుంటుంది. దానికి నిజంగానే భూమిలో నీళ్ళు ఉన్నాయని తెలుస్తోందా..?
ఈ విధంగా చాలా మంది రైతులను మోసం చేస్తున్నారు. కొబ్బరికాయ లోపల నీళ్లు ఉండటం వల్ల అటూ ఇటూ కదులుతూ ఉంటుంది. ఈ విధంగా కదిలేటప్పుడు దాని గరిమనాభి స్థానం మారుతూ ఉంటుంది. కొబ్బరికాయకే కాకుండా ఏ వస్తువుకైనా గరిమనాభి స్థానం ఉంటుంది. ఆ గరిమనాభి నుంచి గీయబడిన లంబ రేఖ ఏదైతే ఉంటుందో అది ఆధారపీఠం గుండా కిందికి వెళ్లినప్పుడు కొబ్బరికాయ స్టేబుల్ గా ఉంటుంది.
ఎప్పుడైతే గరిమనాభి స్థానం మారుతుందో అప్పుడు కొబ్బరికాయ స్థానం కూడా మారుతూ ఉంటుంది. ఈ విధంగా కొబ్బరికాయ పడుతూ, లేస్తూ ఉంటుంది. మనం నడిచే సమయంలో కొబ్బరికాయలు నీళ్లు ఏ మాత్రం కదిలిన కొబ్బరికాయ స్థానం మారుతూ ఉంటుంది. అందువల్ల కొబ్బరికాయ నిలబడుతుంది. ఈ రహస్యాన్ని అడ్డుపెట్టుకుని చాలా మంది ప్రజలను మోసం చేస్తూ వారికి ఏదో భూమిలోఉన్న నీళ్లు తెలుసు అన్నట్టు, అది కూడా కొబ్బరికాయకే తెలుసు అన్న విధంగా వ్యవహరిస్తూ ఉంటారు.
ఈ విధంగా కొబ్బరికాయ పట్టుకుని బోర్ పాయింట్ చూసేదంతా మోసమని కొంతమంది వైజ్ఞానికులు చెబుతున్నారు. కాబట్టి రైతులు ఇలాంటి సూత్రాల నమ్మి డబ్బులు పాడు చేసుకోవద్దని వైజ్ఞానిక నిపుణులు తెలియజేస్తున్నారు. వారికి నిజంగానే భూమిలో నీళ్లు ఉన్నాయో తెలిస్తే కొబ్బరికాయ నే కాకుండా ఏ దోసకాయ, లేదంటే సొరకాయో ఇంకేదైనా వస్తువుతో నీళ్లు ఉన్నాయో లేదో చెప్పాలి.. కొబ్బరికాయ వాడి ఈ విధంగా అమాయక జనాలను మోసం చేస్తూ డబ్బులు దండుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయని నిపుణులు అంటున్నారు.
watch video: