జబర్దస్త్ ఈ పేరు గురించి పెద్దగా పరచియం అక్కర్లేదు ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో టీవీలతో పాటుగా, మొబైల్స్ లో కూడా మారుమోగిపోతూ ఉంది. ఇక యూట్యూబ్ లో అయితే జబర్దస్త్, ఎక్సట్రా జబర్డస్త్ లకి కొన్ని మిలియన్ల సంఖ్య లో వ్యూస్ వచ్చాయి. అంతే కాదు జబర్దస్త్ షో ఎందరికో లైఫ్ ఇచ్చింది.
అలా వారు ఏమి తెలియని స్థాయి నుంచి సినిమాల్లో వేషాలు, హీరోలుగా కూడా నటిస్తున్నారు. ప్రతి గురు, శుక్ర వారాల్లో వచ్చే ఈ షో దాదాపుగా ప్రతి ఇంట్లో తప్పకుండా వీక్షిస్తున్నారు. అయితే ఈ మధ్య కొన్ని నెగటివ్ కామెంట్స్ కూడా ఈ షో పై వినిపిస్తున్నాయి. ఇంట్లో కుటుంబ సమేతంగా చూసే ప్రోగ్రాం లో డబల్ మీనింగ్ డైలాగ్స్, బూతులు ఎక్కువగా వస్తున్నాయి అంటే పెదవి విరుస్తున్నారు.
ఇక టీఆర్పీ విషయం లో జబర్దస్త్ ని కొట్టేవారు లేరు. ఇక జబర్దస్త్ షో లగే పలు టీవీ చానళ్ళు చేయాలనీ చుసిన అవి పెద్దగా సక్సెస్ కాలేదనే చెప్పాలి. ఇక జబర్దస్త్ లో నటిస్తున్న కమెడియన్స్ రెమ్యునరేషన్ విషయానికి వస్తే… యాంకర్ రష్మీ, అనసూయలకి నెలకి నాలుగు నుంచి అయిదు లక్షల వరకు ఇస్తున్నారట.
జడ్జ్ గా నాగబాబు ప్లేస్ లో వచ్చిన ‘మనో’ గారికి పది లక్షల వరకు ఇస్తున్నారట. ఇక మరో జడ్జ్ రోజా గారికి నెలకి ఇరవై నుంచి ఇరవై అయిదు లక్షలు వారికి ఇస్తున్నారట. ఇక టీం లీడర్స్ లో అత్యధికంగాచమ్మక చంద్రకి నాలుగు లక్షలు, సుడిగాలి సుధీర్ కి మూడున్నర లక్షలు, హైపర్ ఆది కి మూడు లక్షలు, రాకెట్ రాఘవ గెటప్ శ్రీనులకి, రెండున్నర లక్షలు ఇస్తున్నారట. వీరికి ఈ మద్యే పది నుంచి ఇరవై శతం వారకు రెమ్యూనరేషన్ ని మల్లెమాల టీం పెంచనారని అంటున్నారు.