యూత్ ఎగబడి మరి చూసిన సినిమా RX 100. ఈ సినిమాలో కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ హీరో హీరోయిన్లుగా నటించారు.ఈ మూవీకి డైరెక్టర్ అజయ్ భూపతి, అయితే ఈ ముగ్గురిని ఓవర్‌నైట్ స్టార్స్‌ని చేసింది RX 100. ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. మూవీలో హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ, డైలాాగ్స్, సంగీతం,రావు రమేష్, రాంకీ లాంటి క్యారెక్టర్లు.
అందులోనూ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తీసిన సినిమా అవడంతో హీరోయిన్ పాత్ర చూసి ఆడియన్స్ అయితే షాక్ అయ్యారు. విజయదేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ సినిమాని మించి రొమాన్స్ తో బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ అయ్యింది RX 100 మూవీ.
ఇలాంటి షేడ్స్ ఉన్న సినిమా ఇది మొదటిది కాదు. ఇలాంటి క్యారెక్టర్లతో 1984లో ఓ మూవీ వచ్చింది. ఆ సినిమా ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ మీద అప్పటి టాప్ ప్రొడ్యూసర్ రామోజీ రావు నిర్మించగా, డైరెక్టర్ వి.మధుసూదన రావు డైరెక్షన్ లో ‘కాంచన గంగ’ అనే రొమాంటిక్ మూవీ అప్పట్లోనే వచ్చింది. ఈ సినిమాలో శరత్ బాబు, చంద్ర మోహన్,సరిత,స్వప్న ముఖ్యమైన పాత్రల్లో నటించారు. సంగీతం చక్రవర్తి సమకూర్చారు. అయితే ఈ సినిమాకి, RX 100 మూవీకి పోలికలుంటాయి. కానీ, స్టోరీ పరంగా రెందింటికి ఎలాంటి సంబంధం లేదు.
కాంచన గంగ కుటుంబ సినిమానే. అయితే చంద్ర మోహన్, స్వప్నల మధ్య ట్రాక్ RX 100 టైపులో ఉంటుంది.కాగా అప్పట్లో ఇలాంటి పాత్రలంటే ప్రేక్షకులకు షాక్ గాను,కొంత వరకు సర్ప్రైజ్ అన్నట్లుగా ఉండేది. సరిత కాంచన పాత్రలో, స్వప్న గంగ పాత్రలో నటించారు. సినిమాలో ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. అయితే కాంచన, ప్రభాకర్ (చంద్ర మోహన్)ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. చంద్ర మోహన్ ఇంటికి స్నేహితురాలిని తోడుగా తీసుకెళ్తుంది.అయితే ప్రభాకర్ ఇంటికి వెళ్లాక వల్ల ఆస్తిపాస్తుల చూశాక, గంగ ఎలాగైనా ప్రభాకర్‌ని ఎలాగైనా తనే చేసుకోవాలనుకుంటుంది.
RX 100 మూవీలో పాయల్ రాజ్పుత్లానే, గంగ కూడా ప్రభాకర్‌ని చెడ గొడుతుంది. గంగ చేసేదంతా కాంచనకి, ప్రభాకర్ ఇంట్లో వాళ్లకి కూడా తెలుస్తుంది.శరత్ బాబు (జయసింహ) హత్య కేసులో ఇరుక్కుంటాడు. అయితే అతను ముందు నుండి ఈ విషయంలో కాంచనకి సాయం చేయాలని చూస్తాడు. కానీ కాంచన అతణ్ణి అసహ్యించుకుంటుంది.ఆ తరువాత ప్రభాకర్, గంగకి ఉద్యోగం ఇప్పించమని తనకు సీనియర్ అయిన ప్రతాప్ పోతన్ (మోహన్)కి చెప్తాడు.అయితే మోహన్ ప్రభాకర్‌ని ఆఫీసు పని మీద బయట ఊరికి పంపించి గంగని వల్లో వేసుకుంటాడు.
మోహన్ కి గంగ కూడా అడ్డు చెప్పదు. ఈ క్రమంలో జయసింహ, కాంచనని కాపాడడం, ఆ తరువాత ఇద్దరూ కలిసి ఉంటూ అతని సాయంతోనే లాయర్ అయ్యి, జయసింహని పెళ్లి చేసుకుంటుంది. ఇదిలా ఉంటే మోహన్ ఒక రోజు మరో వ్యక్తితో ఉండమని గంగని ఇబ్బంది పెడతాడు.గంగ వినకపోఎసరికి ఆమెను బలవంతం చేస్తాడు. దాంతో గంగ అతడిని హత్య చేస్తుంది. సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో తీసిన ‘కాంచన గంగ’ అప్పట్లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.