సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఆట తీరు మాత్రం చాలా దారుణంగా ఉంది. వరుసగా 5 మ్యాచ్ ల్లో ఓడి ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. శనివారం కోల్కత్తా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ ల్లో ఓడిపోయిన తర్వాత జట్టుపై బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు.
అయితే ప్రారంభంలో రెండు మ్యాచ్ లు ఓడిపోయినా తర్వాత ఐదు వరుస విజయాలతో అదరగొట్టింది. దీంతో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మంచిరోజులు వచ్చాయి అని అందరూ భావించారు.
దీని తర్వాత జరిగిన మ్యాచుల్లో వరుసగా ఓడిపోయి ప్లే అప్స్ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితిలో నిలిచింది. శనివారం జరిగినటువంటి మ్యాచ్ లో పరాజయం తర్వాత ఈ జట్టు పై అభిమానులు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. దీనికంతటికీ కారణం కెప్టెన్ కేన్ విలియమ్సన్ అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. వార్నర్ తప్పుకోవడంతో అతడి స్థానంలో వచ్చిన కేను చెత్త ప్రదర్శన కనబరిచారని అంటున్నారు.
ఐపీఎల్ సీజన్ లో అభిషేక్ శర్మతో కలిసి ఓపెనరుగా వచ్చిన కెన్ ప్రారంభంలోనే జట్టు ఓటమిని ఖాయం చేశారు. తాజాగా ఆయన బ్యాటింగ్ చూస్తే 12 మ్యాచ్ లు ఆడితే 208 పరుగులు మాత్రమే చేశారు. ఒకసారి అర్థసెంచరీ సాధించాడు. అయితే టెస్ట్ బ్యాటింగ్ చేస్తున్నటువంటి విలియమ్ సన్ ను ఓపెనర్ గా పంపించడం ఏంటి అని అభిమానుల ఫైర్ అవుతున్నారు. హైదరాబాద్ టీం మేనేజ్మెంట్ కు దిమాక్ ఉందా అంటూ కామెంట్లు చేస్తున్నారు అభిమానులు.