ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కాణిపాకం వరసిద్ధి వినాయకుడి ఆలయం చాలా ప్రసిద్ధి. ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి కాకుండా తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల భక్తులు లక్షల సంఖ్యలో వస్తూ ఉంటారు. నిత్యం ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. అందులోనూ ప్రస్తుతం కార్తీక మాసం కావడంతో భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగింది.
ఈ ఆలయంలో శుక్రవారం ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తిరుపతికి చెందిన లలిత శుక్రవారం ఉదయం స్వామి వారి దర్శనానికి ఆలయానికి విచ్చేసింది. అక్కడ అనుకోకుండా ఆమె ధరించిన మూడు లక్షల రూపాయల హారాన్ని పోగొట్టుకుంది.
ఈ హారం ఆలయంలోని కల్యాణ వేదిక వద్ద విధుల్లో ఉన్న పారిశుద్ధ్య కార్మికురాలు అనసూయమ్మకు హారం దొరకడంతో ఆమె వెంటనే ఆలయ సూపరింటెండెంట్ కోదండపాణికి అందజేశారు.
వెంటనే ఆలయ అధికారులు మైకు ద్వారా హారం దొరికిన విషయాన్ని ప్రకటించడంతో లలిత అక్కడకు వెళ్లారు. ఆలయ సూపరింటెండెంట్ కోదండపాణి ఆమెకు హారాన్ని అప్పగించారు. హారం దొరికిన తర్వాత నిజాయితీ తీసుకొచ్చి ఇచ్చిన అనసూయమ్మను ఆలయ సిబ్బంది అభినందించారు. హారం దొరికిన సంగతి ఆలయ అధికారులు మైక్ లో ప్రకటించారు.అప్పటివరకు భక్తురాలు హారాన్ని పోగొట్టుకున్న విషయాన్ని గమనించలేదు.. మైక్‌లో అనౌన్స్మెంట్ తర్వాత అలర్ట్ అయ్యారు.
అప్పుడు ఆమె చూసుకుంటే హారం లేదు.. ఆ వెంటనే వెళ్లి హారానికి సంబంధించిన వివరాలు చెప్పి తెచ్చుకున్నారు. పోయిన హారం దొరకడంతో ఆమె ఆనందం వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య కార్మికురాలు అనసూయమ్మ, ఆలయ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.ఈ రోజుల్లో కూడా ఇలాంటి నిజాయితీపరులు ఉంటారా అంటూ నెటిజన్ లు అనసూయమ్మను అభినందిస్తున్నారు. భక్తురాలు నిజంగా చాలా అదృష్టవంతురాలు దేవుడి సన్నిధిలో పోయిన హారం ఆయన ఆశీర్వాదంతో తిరిగి దొరికింది అంటూ కామెంట్లు పెడుతున్నారు. కొందరైతే అలాంటి విలువైన వస్తువులు ఆలయానికి ఎందుకు వేసుకురావడం అంటూ ప్రశ్నిస్తున్నారు.
Also Read:బర్రెలక్క ఆస్తులు ఎంత..? అప్పులు ఎంత..? ఆమె ఎన్నికల అఫిడవిట్ లో ఏం ఉందంటే….?