కర్ణాటకలోని బెళగావి జిల్లాలో ఓ మహిళ(38) మెడలో చెప్పుల దండ వేసి ఊరేగించిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. సదరు మహిళ హనీ ట్రాప్ పేరుతో పలువురు పురుషులను లొంగదీసుకొని వసూళ్లకు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి.
అయితే ఇలా మోసపోయినవాళ్లంతా కలిసి ఆమె ఇంటికి వెళ్లి ఆమెను నిలదీశారు. ఆమె దురుసుగా ప్రవర్తించడంతో అందరూ ఒకేసారి దాడికి పాల్పడి ఆమెను కొట్టి మెడలో చెప్పుల దండ వేసి గ్రామ వీధుల్లో ఊరేగించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ ఘటన జరిగినప్పుడు పోలీసులకు ఎమర్జెన్సీ నెంబర్ నుండి ఫోన్ వచ్చింది. వెంటనే స్పందించిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మహిళను వారి నుండి రక్షించారు. 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆ మహిళలను దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి గాయాలకు వైద్యం అందించారు. ప్రస్తుతం ఆ మహిళ కోలుకుంటుంది.
ఈ ఘటనపై కంప్లైంట్ ఇవ్వడానికి ఆ మహిళ నిరాకరించింది. ఇది తమ వ్యక్తిగత విషయం అని దీన్ని తామే సెటిల్ చేసుకుంటామని పోలీసులకు చెపింది. కాకపోతే వీడియో బాగా వైరల్ అవడంతో పోలీసులు కంప్లైంట్ ఇవ్వమని మహిళను ఒత్తిడి చేశారు. ఆ కంప్లైంట్ ఆధారంగా ఆ 13 మందిపై వివిధ సెక్షన్ ల కింద కేసు నమోదు చేసినట్లు బెల్గావి ఎస్పీ భీమశంకర్ గులెడ్ తెలిపారు.
Also Read: జగన్ ప్రభుత్వం మీద కేసీఆర్ ప్రశంసల వర్షం..! ఏం అన్నారంటే..?