బుల్లితెర ప్రేక్షకులలో ఎంతో క్రేజ్ పెంచిన సీరియల్ కార్తీకదీపం. దీని గురించి తెలియని వారు ఉండరు. అయితే ( ఏప్రిల్ 13,2022) కల్ల 1325 ఎపిసోడ్ కు చేరుకుంటుంది. దీంతో అందులో ట్విస్ట్ చాలా ఆసక్తికరంగా మారింది. ఎన్నో ఏళ్లుగా హిమ,సౌందర్యలు సౌర్య కోసం వెతుకుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇందులో ఆటో అమ్మాయి జ్వాల తన అక్క శౌర్య అనే విషయం హిమ కు తెలియడంతో.. జ్వాల యొక్క కోపాన్ని తగ్గించడం కోసం ఎలాగైనా మార్చాలని పట్టుదలతో జ్వాల వెంట తిరుగుతోంది హిమ.
ఈరోజు కథనంలో ప్రేమ్ స్కూటీని శౌర్య మరియు హిమలు చాకచక్యంగా లాగేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే కదా.. స్కూటీ మీద వారిద్దరూ వెళ్తూ సౌందర్య కంటపడతారు. హిమ స్కూటీ మీద వెళ్ళడం ఏమిటి..? ఆ స్కూటీ నడుపుతున్న అమ్మాయి ఎవరు..? అని ఆలోచిస్తూ.. కారు లో ఉన్నటువంటి సౌందర్య వెంటనే యు టర్న్ తీసుకొని వారిని ఫాలో అవుతుంది. ఇదే రేపటి ప్రోమోని ఉత్కంఠగా మార్చింది.
ప్రోమో హైలెట్స్:ఇలా సౌందర్య స్కూటీ వెనకే హారన్ కొడుతూ ఛేజింగ్ చేస్తుంది. ఇంతలో హిమ సౌందర్య కారుని వెనక్కి తిరిగి చూస్తూ… దేవుడా.. దేవుడా.
నానమ్మ వచ్చేస్తోంది అంటూ.. ఇప్పుడు ఏం చేయాలి.. సౌర్య కానీ నానమ్మని చూసిందంటే. ఘోరం జరిగి పోతుంది.. సౌర్య కి నేనే హిమని అని తెలిసిపోతుందని భయపడుతూ ఉంటుంది. ఈ విషయాన్ని బయటకు చెప్పకుండ జ్వాల త్వరగా, వేగంగా పోనివ్వు అంటుంది హిమ. దీంతో జ్వాల స్కూటీ వేగంగా పోనిస్తుంది.
హిమ నన్ను వెనక్కి తిరిగి చూసి మరి వేగంగా వెళుతుందని కోపంతో సౌందర్య కారు వేగాన్ని పెంచుతుంది. హిమ నన్ను చూసినా ఆగడం లేదు ఎందుకని.. కావాలనే తప్పించుకొని వెళ్తుందా.. అసలు బైక్ మీద ఉన్న అమ్మాయి ఎవరు..? అని మనసులో అనుకుంటూ పెద్దగా హారన్ కొడుతుంది. దీంతో హిమ ఇంకా స్పీడ్ గా పోనివ్వు అని జ్వాలను తొందర పెట్టడంతో తన ముందున్న స్పీడ్ బ్రేకర్ ను చూసుకోకుండా ఆ విధంగా స్కూటీ పోనిస్తుంది. దీంతో స్కిడ్ అయ్యి స్కూటీ తో సహా ఇద్దరు ఆగిపోతారు. వెనుక సౌందర్య కారు వచ్చి ఆగుతుంది. కారులోంచి దిగి సౌందర్య కోపంగా చూస్తుంది. వాళ్ల దగ్గరకు నడిచి వెళుతుంది.