తెలుగు సీరియల్స్ లో కార్తీకదీపం సీరియల్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ సీరియల్ లో నటించే నటీనటుల అందరూ దాదాపు ప్రతి తెలుగువారి కుటుంబంలో ఒక భాగమైపోయారు. హీరో, హీరోయిన్లే కాకుండా చైల్డ్ ఆర్టిస్టులు కూడా ఈ సీరియల్ లో చాలా బాగా నటిస్తారు. అందుకే ఈ సీరియల్ లో నటించే చిన్న పిల్లలకి కూడా దాదాపు హీరోహీరోయిన్ల కి ఉన్నంత పాపులారిటీ ఉంది.
ఇంకా ఈ సీరియల్ లో హీరో హీరోయిన్స్, చైల్డ్ ఆర్టిస్ట్స్ తో పాటు పాపులరైన ఇంకొకరు హీరో తల్లి గా నటించే సౌందర్య. సౌందర్య అసలు పేరు అర్చన అనంత్. అర్చన అనంత్ జనవరి 3 వ తేదీన బెంగళూరులో పుట్టారు. అర్చన మాతృభాష తమిళ్. కానీ అర్చనకి కన్నడ బాగా వచ్చట. అర్చన తల్లి ఒక గవర్నమెంట్ ఉద్యోగిని అట. తండ్రి కూడా నటులే అట. ఒక తమిళ్ షో కి ఆడిషన్ చేస్తున్నప్పుడు కార్తీకదీపం టీం అర్చన ని సంప్రదించారట.
అర్చన కి కూడా తెలుగులో నటించాలని ఎప్పటి నుండో ఆలోచన ఉండడంతో ఈ సీరియల్ లో నటించడానికి అంగీకరించారట. అర్చన ఒక ట్రైన్డ్ బ్యూటీషియన్, ఇంకా ఫ్యాషన్ డిజైనర్ అట. తెలుగులోనే కాకుండా కార్తీకదీపం సీరియల్ ఇతర భాషల్లోకి కూడా రీమేక్ అయ్యింది. కార్తీక దీపం సీరియల్ ఒరిజినల్ వెర్షన్ మలయాళం లో 2014 లో మొదలైంది. ఆ తర్వాత తెలుగులో, కన్నడలో, తమిళ్ లో కూడా రీమేక్ అయ్యింది. కన్నడలో ముద్దు లక్ష్మి పేరుతో ఈ సీరియల్ రీమేక్ అయింది.
ఈ సీరియల్ లో అర్చన తెలుగులో చేసిన పాత్రనే కన్నడలో కూడా చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే తెలుగు లో కార్తీకదీపం సీరియల్ లో హీరోయిన్ రోల్ చేస్తున్న ప్రేమి విశ్వనాథ్ మలయాళం లో కూడా మొదట్లో అంటే దాదాపు 300 ఎపిసోడ్ల వరకు హీరోయిన్ కార్తీక (ఒరిజినల్ మలయాళం సీరియల్ కరుత ముత్తు లో హీరోయిన్ పాత్ర పేరు ) పాత్ర పోషించారు.
అర్చన, ప్రేమి విశ్వనాథ్, హీరో నిరుపమ్ కి మధ్య పెద్దగా ఏజ్ డిఫరెన్స్ లేదు. ప్రేమి విశ్వనాథ్ వయసు 28 సంవత్సరాలట, అర్చన వయసు 35 సంవత్సరాలట, నిరుపమ్ వయసు 32 సంవత్సరాలట. కానీ సీరియల్ లో అయితే అర్చన పోషించే పాత్ర వయసు దాదాపు 50 సంవత్సరాల పైనే ఉంటుంది. కానీ అర్చన దీనిని వృత్తిపరంగా మాత్రమే చూసి, ప్రొఫెషనాలిటీతో ఆలోచించి ఈ పాత్రని ఒక ఛాలెంజ్ గా స్వీకరించారు. తన పాత్రలో అంత బాగా నటిస్తారు కాబట్టే సీరియల్ ఇండస్ట్రీలో స్టార్ యాక్టర్స్ లో ఒకరిగా నిలిచారు అర్చన.