ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ లో మ్యాచ్ లన్నీ చాలా హోరాహోరీగా సాగుతున్నాయి. ఒకరికంటే ఒకరు ఎక్కువ అంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. అయితే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు మాత్రం చాలా జోరు మీద ఉన్నది. గత సంవత్సరం కేవలం మూడు మ్యాచ్ ల్లో గెలిచి పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి చేరిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆ సమయంలో డేవిడ్ వార్నర్ విభేదాలతో జట్టు పరువు కూడా పోయింది.
ఇక వేలానికి ముందు కేన్, అబ్దుల్ సమద్, ఇమ్రాన్ మాలిక్, రిటన్ చేసుకొని విమర్శల పాలు కూడా అయింది. ఈ యొక్క మెగా వేలంలో జట్టు కొనుగోలు చేసిన దానిపై కూడా టీం ఓనర్ కావ్య మారన్ తీవ్రంగా విమర్శల పాలైంది. అయితే ప్రారంభంలో జరిగిన రెండు మ్యాచ్ ల్లో సన్రైజర్స్ తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో ఎంతో మంది అభిమానులు సెటైర్లతో ఆడేసుకున్నారు. లక్నో సూపర్ జెంట్స్ తో హైదరాబాద్
ఓడిపోవడం పై తీవ్రంగా నిరాశకు గురి అయిన కావ్య మారన్, దాని తర్వాత జరిగిన మ్యాచ్లో కూడా హాజరు కాలేదంటే అర్థం చేసుకోవచ్చు. తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ తో ఆడినటువంటి ఆటలో హైదరాబాద్ ఆట తీరు మారిపోయింది. వరుస మ్యాచుల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో ఉన్నారు.
వీటితో పాటుగా ప్లేయర్స్ పై కూడా అనేక కామెంట్స్ చేస్తూ అభిమానులు ఆనందిస్తున్నారు. 16 కోట్లకు కొన్న ప్లేయర్స్ సన్రైజర్స్ హైదరాబాద్ ను రెండవ స్థానంలో తీసుకువచ్చారని గర్వపడుతున్నారు. ఇందులో భువనేశ్వర్ 4.20 కోట్లు, ఉమ్రాన్ 4.0 కోట్లు, నటరాజన్ 4.0 కోట్లు, జాన్సన్ 4.20 పెట్టి కొన్న ఈ ప్లేయర్లు జట్టును శిఖరాగ్రానికి తీసుకెళ్తున్నారు.
అయితే శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుతో జరిగినటువంటి మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు అద్భుత ప్రదర్శనతో అందరిని మైమరపించింది. జాన్సన్ ఒక్క ఓవర్లోనే మూడు వికెట్లు తీస్తే, ఆ తర్వాత వచ్చిన నటరాజన్ మరో మూడు వికెట్లతో అదరగొట్టాడు. దీంతో ఆర్ సి బి జట్టు 68 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కనీసం 100 పరుగులు కూడా చేయకముందే ఇలా అవుట్ అవ్వడం బట్టి చూస్తే వాళ్లు ఏ విధంగా ఆడారు అనేది తెలుస్తుంది. జాన్సన్ మరియు నట్టు తలా ఒక వికెట్ తో మ్యాచ్ కైవసం చేసుకున్నారు. అయితే గ్యాలరీ లో ఉండి మ్యాచ్ చూస్తున్న కావ్య మారన్ ఆనందంతో ఎగిరి గంతేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలన్నీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి.