పెళ్లిచూపులు సినిమా తోటి తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు డైరెక్టర్ తరుణ్ భాస్కర్. చాలా తక్కువ బడ్జెట్లో తీసిన ఈ సినిమా ఎవరూ ఊహించని విధంగా పెద్ద బ్లాక్ బస్టర్ అయి పెట్టిన పెట్టుబడికి 10 ఇంతలు లాభాన్ని తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది అన్ని యూత్ ఫుల్ మూవీ తీశాడు. ఇది ఫస్ట్ రిలీజ్ అప్పుడు యావరేజ్ గా ఆడింది కానీ సెకండ్ రిలీజ్ లో మాత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
అయితే తరుణ్ భాస్కర్ ఆ సినిమా తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో విక్టరీ వెంకటేష్ తో సినిమా అన్నాడు కానీ అది పట్టాలెక్కలేదు. తర్వాత నటుడిగా కొన్ని సినిమాల్లో అలరించాడు. పలు టీవీ షోల్లో హోస్టుగా కూడా పనిచేశాడు. ఇప్పుడు కీడా కోలా అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు తరుణ్ భాస్కర్.
నవంబర్ మూడో తారీఖున ఈ సినిమా విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమాకు ఇటీవల ప్రీమియర్స్ పడ్డాయి. ముందునుంచి మంచి మనసున్న ఈ సినిమా ప్రీమియర్స్ లో కూడా మంచి టాక్ సంపాదించుకుంది. ఈ సినిమాలో తరుణ్ భాస్కర్ కూడా ఒక ముఖ్య పాత్ర పోషించాడు. బ్రహ్మానందం కూడా ఒక డిఫరెంట్ రోల్ లో చేసినట్టు తెలిపారు.
ఒక కూల్ డ్రింక్ లో బొద్దింక ఉంటుంది. దానిని చూపించి కేసు వేస్తే కోట్లు వస్తాయని నమ్మే ఇద్దరు కుర్రాళ్ళు. ఈ ప్రాసెస్ లో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు. పొలిటికల్ గా, కార్పొరేట్ కంపెనీలు పరంగా వీరిపై ఎలాంటి ఒత్తిడి వచ్చిందన్ పాయింట్ తో ఈ సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తుంది.
ఫస్ట్ ఆఫ్ స్టార్టింగ్ కోసం చాలా స్లోగా ఉందంట.సెకండ్ హాఫ్ లో యూత్ ని ఆకట్టుకునే అంశాలు ఉన్నాయని తెలుస్తుంది. అయితే కామెడీ పోర్షన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి అని టాక్. తరుణ్ భాస్కర్ నటన జవన్ నటన హిలేరియస్ గా ఉందని అంటున్నారు. వివేక్ సాగర్ బ్యాగ్రౌండ్ స్కోర్ అయితే అదిరిపోయిందని వినిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే తరుణ్ భాస్కర్ గత సినిమాల కన్నా క్రీడా కోలా సినిమా యూత్ కి నచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఫైనల్ టాక్ కోసం సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వేచి చూడాలి.
Also Read:మళ్లీ అదే హీరోతో అనిల్ రావిపూడి సినిమా…! ఇంతకీ ఎవరా హీరో…!