ఎవరికైనా సరే ఇడ్లి అంటే పెద్దగా నచ్చదు. దోస పెసరట్టు వడతో పోలిస్తే ఇడ్లీకి ఫాన్స్ తక్కువే. కానీ ఇడ్లీ ని ఇష్టపడే వారు కూడా చాలామంది ఉంటారు. ఇడ్లీ అన్ని టిఫిన్ తో పోలిస్తే చాలా ఆరోగ్యకరం. ఏదైనా అనారోగ్యం చేసినప్పుడు వైద్యులు కూడా ఇడ్లీనే తినమని సూచిస్తూ ఉంటారు. ఇడ్లీ తింటే ఈజీగా డైజెస్ట్ అవుతుంది. దక్షిణాది అల్పాహారంలో ఇడ్లీకి ప్రత్యేక స్థానం ఉంది. వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా తేలికగా తినగలరు.
ఇడ్లీతో రకరకాల చట్నీలు కలిపి అమ్ముతూ ఉంటారు. పచ్చడతో తిన్నా, సాంబార్ తో తిన్నా పర్వాలేదు కానీ ఒక వీధి వ్యాపారి చేస్తున్న పని ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది.ఈ వీడియో చూసిన ఎవరైనా సరే ఆరోగ్యకరమైన ఇడ్లీతో ఈ ప్రయోగాలు ఏంటి దాన్ని అసలు ఎలా తింటారు అంటూ విరుచుకుపడుతున్నారు. ఇంతకీ ఈయన ఏం చేశాడంటే ఇడ్లీతో ఏకంగా కీమా తయారు చేశాడు.
వీధుల్లో ఆహారం విక్రయించే వ్యాపారి పెద్ద పెనం మీద ఇడ్లీలను పెడతాడు.వాటి మీద వెన్న మసాలా పొడులు వేసి ఇడ్లీలను వేయిస్తున్నాడు.ఆ తర్వాత ఇడ్లీలను కాస్త పెనం చివరకు జరిపి పెనం మధ్యలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు టమోటా పచ్చిమిర్చి వెన్న బంగాళదుంప కూర మసాలా పొడి వేసి బాగా కలిపి దాని మీద మూత పెట్టి ఉడికిస్తాడు. ఆ తర్వాత మూత తీసి పప్పును మెదిపినట్టు ఆ మిశ్రాన్ని బాగా మెదుపుతాడు. పక్కన ఉన్న ఇడ్లీలను గ్రేవీ మీద ఉంచి ఆ తర్వాత ఇడ్లీలను ముక్కలు ముక్కలు చేస్తాడు దీన్ని బాగా కలిపి కొత్తిమీర వేసి మళ్లీ పప్పు లాగా మెదుపుతాడు అంతే ఇడ్లీ కీమా తయారు అయిపోయినట్టే ఈ కీమాను చట్నీ సాంబార్ తో సర్వ్ చేస్తున్నాడు.
ఈ వీడియోను ద గ్రేట్ ఇండియన్ ఫుడీ అనే ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేశారు మీరు ఎప్పుడైనా ఇడ్లీ కీమా తిన్నారా అన్న క్యాప్షన్ పెట్టాడు. ఈ వీడియో చూసిన నేటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. అతని అడ్రస్ పెట్టండి అంటూ ఒకరు, అతని తాలిబాన్ లోకి పంపండి అంటూ మరొకరు, దయచేసి ఇడ్లీని ఇలా చేయకండి అని చాలామంది ఇడ్లీ లవర్స్ బాధపడుతున్నారు.
ఏదేమైనా సరే ప్రస్తుతం రకరకాల ప్రయోగాలు చేసి కొత్త వంటలు సృష్టించి జనానికి అమ్ముతున్నారు. మన జనం కూడా ఏదైతే అదయిందంటూ కొత్తదనానికి మక్కువ చూపిస్తున్నారు. ఆరోగ్యం గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. మన పెద్దలు చెప్పినట్టు ఏ వంటని ఆ విధంగా తింటేనే ఒంటికి పడుతుంది ఇలా రకరకాలుగా చేసి తింటే అది లోపలికి వెళ్లి ఏం చేస్తుందో కూడా తెలియదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Watch Video:
https://www.instagram.com/reel/CyvfGaqp_OK/?utm_source=ig_embed&ig_rid=c35e4306-2353-454a-b185-f12cd81a911a