ప్రేమ అనేది ఎప్పుడు ఎక్కడ ఎవరిపై పుడుతుందో మనం చెప్పలేం. కనీసం ఊహించలేం కూడా. ప్రేమ అనే రెండక్షరాలలో ఏం మత్తు ఉంటుందో కానీ ఒక్కసారి దాని వలలో చిక్కారు అంటే ఇక బయటకు రావడం కష్టం. మరి ఇలా ప్రేమించి ప్రాణాలు పోగొట్టుకున్న వారు ఉన్నారు. తమ జీవితాలను నిలబెట్టుకున్నవారు ఉన్నారు.
ఏది ఏమైనా ప్రేమ గుడ్డిది అని పెద్దలు ఊరికే అనలేదు. అలాంటి సామెత ప్రస్తుతం కొంతమందిని చూస్తే మనకు అనిపిస్తుంది. అది ఏంటో తెలుసుకుందామా..! ప్రస్తుత కాలంలో వీరిని చూస్తే ప్రేమ పెళ్లి చాలా బెటర్ అనిపిస్తుంది. వారే కీరా, జార్జ్ కీవుడ్.. పూర్తి వివరాల్లోకి వెళితే సియన్న కీరా వయసు 27 సంవత్సరాలు.
ఆస్ట్రేలియాకు చెందిన ఒక ఆర్టిస్ట్. అలాంటి మరో ఆర్టిస్టు అయినా బ్రిటన్ కు చెందిన వ్యక్తి జార్జ్ కివుడ్ ని ప్రేమించి వివాహం చేసుకుంది. వీరికి ప్రస్తుతం ఒక బాబు కూడా. వారి జీవితం బాగానే కొనసాగుతుంది. ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ ఆమెను ట్రోలర్స్ మాత్రం అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మీరు అలా ఎలా పెళ్లి చేసుకున్నారు అని ట్రోల్ చేస్తున్నారు. ఇంత అందంగా ఉన్న నువ్వు ఆయనను ఎలా చేసుకున్నావ్ అంటూ ప్రశ్నిస్తున్నారు. నువ్వు పెళ్లి చేసుకోవాలని అడిగితే కోటిమంది క్యూ కడతారని, అలాంటి నువ్వు నీ కంటే రెట్టింపు సైజులో అంత లావుగా ఉన్న వ్యక్తిని ఎలా ప్రేమించావు.ఎలా పెళ్లి చేసుకున్నావని అడుగుతున్నారు. సిడ్నీలో ఉండే సీయన్న పెళ్లి తర్వాత లండన్ కి వెళ్లి పోయింది.
అక్కడ తన భర్తతో హాయిగా ఉంటుంది. నేను చాలా సంతోషంగా ఉన్నాను కానీ మీ మాటలతోనే బాధపడుతున్నానని ప్రశ్నిస్తోంది. నా జీవితంలో మీరు డిటెక్టివ్ గా మారిపోయారని అంటోంది. కానీ కొంతమంది ట్రోలర్లు మాత్రం నువ్వు అతని పెళ్లి చేసుకోవడానికి ప్రధాన కారణం జార్జ్ బాగా డబ్బున్న వాడని అతని వెంట పడి ప్రేమ పేరుతో ముగ్గులోకి దింపావు అంటున్నారు. రెండు రోజుల టూర్ అని లండన్ వెళ్లి నువ్వు సీయన్నతొ ఆరు వారాల పాటు లండన్ టూర్ వేశావు. ఇలా ఇద్దరు డేటింగ్ చేసుకొని ఒకరి అభిప్రాయాలు ఒకరు అర్థం చేసుకున్నారు. కానీ ఈ కథను ట్రోలర్లు మాత్రం రివర్స్ అర్థం చేసుకున్నారు. అతన్ని ప్లాన్ ప్రకారమే తన అందచందాలతో అట్రాక్ట్ చేశావని అతనితో భారీ టూర్ ప్లాన్ చేసి ఖర్చు పెట్టించి బుట్టలో పడేసి పెళ్లి చేసుకున్నావని అంటున్నారు.