పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్స్ లో ఈమె కూడా ఒకరు. తన గ్లామర్ విషయంలో ఏమాత్రం తగ్గకుండా ఎప్పటికప్పుడు అలరిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఆమె వైట్ డ్రెస్ లో ఉన్నటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వైట్ డ్రెస్ లో అంత స్పెషల్ ఏముంది అంటారా ఆ డ్రెస్ కాస్ట్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు.. ఆ డ్రెస్ వ్యాల్యూ ఏంటో చూద్దామా..?
పూజా హెగ్డే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో భాగంగా డెబ్యూ ఇచ్చింది . మొదటిసారి ఈవెంట్ కు ఆహ్వానం అందడంతో రెడ్ కార్పెట్ పై తన అందాలను ఒలకబోస్తూ అట్రాక్ట్ చేస్తుంది.
దీనిలో భాగంగానే సాగరతీరంలో పూజ ఫోటో షూట్ అందరినీ ఆకట్టుకుంది. ఇందులో చాలా స్పెషల్ గా ఆమె ధరించిన వైట్ డ్రెస్ పై అందరి కన్ను పడింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో భాగంగా ఆమె వేసుకున్న డ్రెస్ ఖరీదు లక్ష 15 వేల రూపాయలు. ఈ డ్రెస్సు చూడటానికి చాలా సింపుల్ గా ఉన్న దీని వెనుక పెద్ద కథే ఉంది. ఆస్ట్రేలియాకు చెందిన ఇటువంటి డిజైనర్ టోనీ దీని గురించి వివరించారు.
https://www.instagram.com/p/CdsvOwMqAdG/?utm_source=ig_web_button_share_sheet
If the dream is big enough, the “how” doesn’t matter. The universe will make it happen. Cannes 2022. #debut pic.twitter.com/NJfV2podMC
— Pooja Hegde (@hegdepooja) May 20, 2022
ఈ డ్రెస్సు ఎక్కడ కూడా హ్యాంగ్ అవుతున్నట్టు కనిపించదని, ఒకపక్క బాడీకి అతుక్కు పోయినట్లు కనిపిస్తూనే మరోపక్క మెడ, ఎద భాగంలో పర్ఫెక్ట్ డిజైన్ ఉంటుందట. అందుకోసమే దీనికి అంత రేటు పెట్టాల్సి వచ్చిందని చెబుతూ ఉన్నారు. పైగా ఈ డ్రెస్సు ధరిస్తే జ్యువెలరీ ఖర్చు కూడా తగ్గుతుందని, సింపుల్ గా ఇయర్ రింగ్స్ ధరిస్తే సరిపోతుందని అంటున్నారు. అయితే పూజ పాప ఈ డ్రెస్ వేసుకొని చాలా సింపుల్ జ్యువెలరీ తో బీచ్ దగ్గర అదరగొట్టింది. అలా కేన్స్ లో తన టూర్ ను పూర్తి చేసింది. ప్రస్తుతం ఇండియా కు బయల్దేరింది. ఇక్కడికి వచ్చిన తర్వాత పూజా హెగ్డే మళ్లీ మూవీస్ షూటింగ్ లో బిజీ కానుంది. అలాగే సర్కస్ సినిమా ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టనుంది. అంతేకాకుండా తెలుగులో త్రివిక్రమ్ మహేష్ బాబు సినిమాలో కూడా నటించబోతోందని తెలుస్తోంది.