కెజిఫ్ 2 భారీ అంచనాలు ఉన్న రాబోయే సినిమాల్లో ఇది ఒకటి. కెజిఫ్ మొదటి భాగం భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా టీజర్ భారీ రికార్డులని సొంతం చేసుకొని యు ట్యూబ్ లో హైయెస్ట్ వ్యూస్ సాధించింది. కరోనా కారణంగా ఇప్పటికే పలు మార్లు సినిమా వాయిదా పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాని డిసెంబర్ నెలలో భారీగా విడుదల చేయాలని నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. పాన్ ఇండియా సినిమా గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా. కన్నడ, తెలుగు,, హిందీ, తమిళం, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం కెజిఫ్ 2 కి ప్రముఖ ఓటీటి సంస్థ థియేట్రికల్ రిలీజ్ ని స్కిప్ చేస్తూ తమకు ఇవ్వాలంటూ నిర్మాతలను సంప్రదించగా వారు తిరస్కరించినట్టు సమాచారం. ఆర్ ఆర్ ఆర్ కంటే ఎక్కువ మొత్తంలో ఆఫర్ చేసినప్పటికీ కూడా తాము థియేటర్స్ లోనే విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు.ఈ సినిమాలో సంజయ్ దత్త్, ప్రకాష్ రాజ్, రావు రమేష్ లు నటించనున్నారు.