డైరెక్టర్ లు ఎంత శ్రద్ధ తీసుకున్నా కూడా సినిమాలో అనుకోకుండా చిన్న చిన్న తప్పులు దొర్లుతూ ఉంటాయి. అవి కావాలని చేసినవి కాదు. ఆ తప్పులను పట్టుకుని చాలామంది వేలెత్తి చూపిస్తూ ఉంటారు. ఆ తప్పులు కూడా భారీ తప్పులు కూడా ఏం కాదు. చిన్న చిన్న తప్పులే. అవి ఏలాంటివి అంటే సినిమాలో టైం చూపించేటప్పుడు, సంవత్సరాల గురించి చెప్పేటప్పుడు, ఏదైనా వ్యక్తుల గురించి చెప్పేటప్పుడు లేదా వస్తువులు, బట్టలు ఇలా అనుకోకుండా జరుగుతూ ఉంటాయి.
ఇప్పుడు అలాంటిదే ఖైదీ సినిమాలో జరిగిన చిన్న తప్పు గురించి చెప్పుకుందాం. ఖైదీ అంటే మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ కాదు, తమిళ హీరో కార్తి నటించిన ఖైదీ మూవీ లోది. సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఖైదీ మూవీ ఎంతటి విజయం సాధించింది అందరికీ తెలిసిందే.
అప్పటి వరకు ఉన్న మూస ఫార్మాట్లకు ఖైదీ మూవీ మంచి సమాధానం చెప్పింది. కార్తిని సరికొత్తగా ప్రజెంట్ చేశారు. ఒక నైట్ లో జరిగే సినిమాలో ఎన్నో డీటెయిల్స్ ఇచ్చాడు డైరెక్టర్. ఈ సినిమా లోకేష్ కనగరాజ్ సినిమా టికెట్ యూనివర్సిటీలో ఉందని కూడా తెలిసింది.అయితే ఇప్పుడు ఈ మూవీలో జరిగిన చిన్న మిస్టేక్ ఏంటంటే కార్తి తన ఫ్లాష్ బ్యాక్ గురించి చెబుతూ ఒకరోజు శుక్రవారం చిరంజీవి సినిమా ఫ్లాట్ ఫామ్ జనం అంత సెకండ్ షో సినిమాకు పోయారు… అంటూ చెప్పుకొస్తూ ఉంటాడు. ఇందులో తప్పేముంది అనుకుంటున్నారా. ఖైదీ సినిమా వచ్చిన సంవత్సరం 2019. కార్తి సినిమాలో పది ఏళ్ల క్రితం జైలుకి వెళ్లినట్టు చెబుతాడు. అంటే అది 2009వ సంవత్సరం. అప్పటికి చిరంజీవి సినిమాలో నటించిన లేదు, రాజకీయాల్లో ఉన్నారు.
చిరంజీవి మగధీర సినిమాలో చిన్న క్యామియో చేశారు. అది చిరంజీవి సినిమా లెక్కల్లోకి రాదు. లోకేష్ కనకరాజు చిరంజీవి సినిమా రిఫరెన్స్ అయితే తీసుకున్నాడు గాని సంవత్సరాన్ని పట్టించుకోవడం మానేశాడు. ఇక్కడే సోషల్ మీడియాలో తప్పులు వెతికే వారికి దొరికేశాడు. ఇది పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకోండి. అయినా కూడా ఇలాంటి చిన్న చిన్న తప్పుడు చూసుకోవాలి కదా లోకి బ్రో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Also Read:ఇవన్నీ విచిత్ర ఆరోపణలు..! హిట్స్ వస్తున్న కారణంగానే..?” అంటూ… “నందమూరి చైతన్య కృష్ణ” కామెంట్స్..!