ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేది గొప్ప వారి నైజం. అది ఫాలో అయితే మనం ఇంకా అభివృద్ధి చెందుతాం. డబ్బులు ఊరికే రావు అంటూ మనకు నిత్యం జువెలరీ యాడ్స్ లో కనిపించే వ్యక్తి.. గుర్తొచ్చే ఉంటుంది.. లలిత జ్యువెలరీ అధినేత కిరణ్ కుమార్.. ఆయన చెప్పిన విధంగానే తన జీవితంలో కూడా పాటిస్తూ ఉంటారు. సాదాసీదాగా జీవనాన్ని గడుపుతూ పదిమందికి రోల్ మోడల్ గా నిలుస్తూ ఉంటారు.
ప్రస్తుత కాలంలో జువెలరీ యాజమాన్యాలు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి యాడ్స్ చేస్తుంటే.. యజమానిగా ఉండి ఆయన కష్టపడి యాడ్ చేసి సాదాసీదా జనాలకి కూడా అర్థమయ్యే రీతిలో జువెలరీ గురించి తెలియజేస్తున్న వ్యక్తి. డబ్బులు ఊరికే రావు అనే ఒక బ్రాండ్ మెసేజ్ ఇస్తున్నా లలిత జ్యువెలరీ అధినేత కిరణ్ కుమార్ కోట్లాది రూపాయల డబ్బులు ఉన్నా ఒక సాధారణ వ్యక్తిలా జీవిస్తూ ఉంటారు. ఎప్పుడు అందరితో కలిసి పోతూ ఉంటారు.
ఇంతటి ధనవంతుడు రోడ్డు పక్కన ఉన్నటువంటి చిన్న దోశ బండి పై టిఫిన్ చేస్తారంటే మీరు నమ్ముతారా.. నిజమేనండి తాజాగా కిరణ్ కుమార్ నెల్లూరు జిల్లాలో ఒక చిన్న టిఫిన్ బండి దగ్గర దోష తింటూ కనిపించాడు. దింతో ఆయన తింటున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నాలుగు పెద్దపెద్ద జ్యువలరీ షాప్స్ అధినేత ఇలా దోస బండి దగ్గర టిఫిన్ చేయడం చూస్తున్న నెటిజన్స్ ఆయన చేసిన యాడ్ ను పేరడీ గా మార్చి జోక్స్ చేస్తున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని ఆయన సింప్లిసిటీ ని ప్రశంసలతో ఎత్తేస్తున్నారు .