ప్రస్తుత కాలంలో పురుషులతో పాటుగా మహిళలు కూడా సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. వారు వంట గదికి వెళ్లే సమయం కూడా దొరకడం లేదంటే మహిళలు ఎంత అభివృద్ధి చెందారో అర్థం చేసుకోవచ్చు. ఇందులో మరీ ముఖ్యంగా జాబ్ చేసే మహిళలు వివాహం చేసుకొని అత్త గారి ఇంటికి వెళ్ళినప్పుడు వంటల విషయానికి వచ్చినప్పుడు బిత్తర చూపులు చూస్తున్నారు. ఇందులో చాలా మందికి వండిది తిని పెట్టడం మాత్రమే తెలిసిన వారే ఎక్కువగా ఉన్నారు. కనీసం వంటగదిలోకి వెళ్లి ఏ వంట వండాలో కూడా తెలియని వారు ఉన్నారంటే వారంతా బయట ఫుడ్ కే అలవాటు పడిపోయారు.
పురుషులతో పాటుగా మహిళలు జాబ్ చేస్తూ కనీసం వంటగదికి వెళ్ళే సమయం కూడా ఉండటం లేదు. ఇందులో మరీ ముఖ్యంగా పెళ్లైన ఆడవారు అత్తవారింటికి వెళ్ళిన వంట చేయమంటే దిక్కులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో కొత్తగా పెళ్లయి అత్తగారింటికి వెళ్లిన ఒక ఇంజనీర్ కోడలు వంట చేసేటప్పుడు పడే కష్టాలకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. వివాహం జరిగిన మరుసటి రోజు నుంచే తన కోడలిని అత్తగారు కిచెన్లోకి తీసుకువెళుతుంది. కానీ ఆ కోడలికి వంట చేయడంలో ఏమాత్రం పరిజ్ఞానం ఉండదు.
దీంతో అత్తగారి సూచనలతో రోటీలు చేయడం మొదలుపెడుతుంది. ఈ తరుణంలో పెనం మీద రోటీ కాల్చుతుండగా.. అత్తగారు అలా కాదు కాల్చేది అని చెబుతుంది. ఇంతలో రోటి మాడిపోతుంది. దీంతో అత్తగారు రోటీని తిప్పి వేయి అని చెబుతుంది. దీంతో కోడలు వెంటనే పెనము లేపి స్టవ్ మీద పడేస్తుంది. దీంతో ఆ కోడలు వంట చేసే తీరును చూసిన అత్తగారు తల పట్టుకుంటుంది. కోపానికి వచ్చి కోడలు తలపై ఒకటి ఇస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి నటువంటి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అత్తా కోడళ్ళ మధ్య జరిగే టువంటి కామెడీ చూసి నెటిజన్లు తెగ ఎంజాయ్ చేస్తూ కామెంట్లతో ముంచేస్తున్నారు.