క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమిడియన్ గా, విల్లన్ గా తెలుగు ప్రజలని మెప్పించిన సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు గారు. ప్రస్తుతం సినిమాలకి దూరంగా ఉన్న కోట గారు. ఇటీవలే పలు చానళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చారు. సినిమా రంగం గురించి, రాజకీయాల గురించి తన అభిప్రాయాలూ పంచుకున్నారు అలాగే నేటితరం యువ హీరోల గురించి కూడా పలు కామెంట్స్ చేసారు.
తనకు ఎన్నో వైవిధ్యమైన పాత్రలు ఇచ్చి ప్రేక్షకుల్లో తనకు ఎంతో పేరు తెచ్చి పెట్టెల చేసిన దర్శకుడు ‘ఈవీవీ సత్యనారాయణ గారంటే ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చారు.యంగ్ హీరోల గురించి మాట్లాడుతూ కొంత మందికి అసలు జ్ఞానం పెరగలేదని, గతం తో పోలిస్తే సాధన కరువైందని చెప్పారు.పలు ఫంక్షన్స్ లో కూడా అసలు తెలుగు లో కూడా మాట్లాడం లేదని చెప్పారు. కొంతమందికి డబ్బువుంటే చాలు హీరోలవుతున్నారు అని చెప్పారు. ఇప్పటి యంగ్ హీరోస్ లో జూనియర్ ఎన్టీఆర్ , నానీలు బాగా నటిస్తున్నారు అని చెప్పుకొచ్చారు.
Also Read: స్కూల్ బస్సులకు సైడ్ లో ఆ “నల్ల రంగు గీతలు (BLACK LINES) ఎందుకు ఉంటాయో తెలుసా.?