Shweta Basu Prasad: శ్వేతా బసు ప్రసాద్ టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే.ఈ హీరోయిన్ ‘కొత్త బంగారులోకం’ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే అమాయకత్వంతో కూడిన పాత్రలో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఈ సినిమాలో శ్వేత బసు ప్రసాద్ ఎకడా అంటూ, తన అల్లరి చేష్టలతో గుర్తుండిపోయేలా నటించింది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత యూత్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. శ్వేతా బసుకు వరుస ఆఫర్లు వచ్చాయి. కానీ అవన్నీ ప్లాప్ అవడంతో, పాపులారిటీ ఎంత తక్కువ టైమ్ లో సంపాదించుకుందో, అంతే ఫాస్ట్ గా ఫేడ్ అవుట్ అయిపోయింది. శ్వేతా బసు చైల్డ్ యాక్టర్ గా హిందీ, బెంగాలీ సినిమాలలో నటించింది. అక్కడ పేరు సంపాదించింది.
బాలనటిగా శ్వేత బసు మొదటి హిందీ సినిమా ‘మక్డీ’ లో డబుల్ రోల్ చేసి అలరించిడమే కాక, బెస్ట్ చైల్డ్ ఆర్టిస్టుగా నేషనల్ అవార్డ్ కూడా అందుకుంది. సినిమాల్లో అవకాశాలు తగ్గుతున్న సమయంలో శ్వేత బసుకు జరిగిన ఒక ఇన్సిడెంట్ అప్పట్లో అందర్నీ షాక్ అయ్యేలా చేసింది. ఆ సంఘటన ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. అది జరిగిన తరువాత ఆమె బాలీవుడ్ కి వెళ్ళింది. అక్కడే ఉంటూ హిందీలో సీరియల్స్ లో నటిస్తూ, ఇంకో వైపు అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ పని చేసింది. శ్వేత బసు డిసెంబర్ 2018 లో ఫిల్మ్ మేకర్ రోహిత్ మిట్టల్ ని వివాహం చేసుకుంది.కానీ ఏం జరిగిందో కానీ ఏడాదికే విడిపోయారు.అయితే ఇప్పుడు మళ్లీ తెలుగు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నట్టుంది. అందుకేనేమో ఇటీవల హాట్ ఫోటో షూట్లను షేర్ చేస్తూ, ఇన్‌స్టాలో హీట్ పెంచుతోంది. సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే సంపాదించింది. తాజాగా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కోసం గోవా వెళ్లిన శ్వేత బసు బీచ్‌లో సందడి చేసింది. ‘ఇండియా లాక్డౌన్’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మరియు ప్రమోషన్స్‌లోనూ అందాల ఆరబోతతో రచ్చ లేపింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్వేత బసును ఇన్‌స్టాగ్రామ్‌లో 440K ఫాలో అవుతున్నారు.