ప్రేమ గుడ్డిది అంటారు.. ప్రేమిస్తే ఎంతకైనా తెగిస్తారు అంటారు. కానీ నిజంగానే ప్రేమ గుడ్డిదే కాదు దొంగది కూడా అని వీళ్లను చూస్తే అర్థమవుతుంది. వీళ్ళది అలాంటి ఇలాంటి ప్రేమ బంధం కాదు. ప్రేమికుని కోసం ప్రేమికురాలు దొంగతనాలకు పాల్పడే స్థాయికి ఎదిగిందంటే ఈ భగ్న ప్రేమికుల ప్రేమ వర్ణనాతీతం. తన లవర్ ని సర్వస్వంగా మార్చుకొని దొంగతనాలకు అలవాటు పడ్డది ఈ యువతి. పూర్తి వివరాలు ఏంటో చూద్దాం..?కోయంబత్తూరు సోమయం పాల్యంకు చెందినటువంటి ప్రశాంత్.. రఘునాథ పురానికి చెందినటువంటి హెచ్.తేజస్విని ఒక ప్రైవేట్ కళాశాలలో బీటెక్ చదువుతున్నారు. వీరు గత మూడు సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నారు. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని చాలా దగ్గర అయిపోయారు. అది ఎంతలా అంటే ఒకరికొకరు ఏదైనా చేసే అంత. ఈ క్రమంలో ప్రశాంత్ ఆన్లైన్ బెట్టింగ్స్ కు చాలా అలవాటు పడ్డాడు. వాటి కోసం పదిహేను లక్షల రూపాయల వరకు అప్పు చేసి బెట్టింగ్ లో పోగొట్టుకున్నాడు. దీంతో అప్పిచ్చిన వాళ్లంతా ప్రశాంత్ పై ఒత్తిడి చేయడంతో ఆ విషయాన్ని తన లవర్ తేజస్వికి చెప్పుకున్నాడు. దీంతో ఇద్దరూ ఎలాగైనా మనీ సంపాదించాలని ఈజి మని కోసం దొంగతనాల బాటపట్టారు. తేజస్వినికి స్కూటీ కూడా ఉంది. ఆ బండి పై తొండమూత్తూరు వైపు వెళ్లారు. అక్కడ ఫైర్ స్టేషన్ సమీపంలో మేకలు కాస్తున్న వృద్ధురాలి దగ్గరికి మధ్యాహ్నం రెండు గంటల సమయంలో వెళ్లారు. ఆ ముసలావిడను అడ్రస్ అడిగినట్టే అడిగి మెడ నుంచి గోల్డ్ చైన్ లాక్కొని స్కూటీపై ఇద్దరు పరారయ్యారు. దీంతో ఆ వృద్ధురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రంగంలోకి దిగి సీసీ ఫుటేజ్ పరిశీలించి తమదైన శైలిలో విచారణ చేపట్టి తేజస్విని బైక్ నెంబర్ ను గుర్తించారు. దాని ఆధారంగా అడ్రస్ పట్టుకొని ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టైల్ లో విచారించగా జరిగిన విషయం అంతా ఒప్పుకున్నది. కొన్ని నెలల కిందట ప్రశాంత్ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి బంగారం కూడా కనిపించడం లేదని ప్రశాంత్ తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విచారణలో ప్రశాంత్ ఆ బంగారాన్ని దొంగిలించినట్లు కూడా తేలింది. ఈ డబ్బంతా ఆన్లైన్ బెట్టింగ్ లో పెట్టి పోగొట్టుకున్నామని ప్రశాంత్ తెలియజేశాడు. దీంతో ఇద్దరిని కోర్టులో హాజరు పరిచారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ప్రశాంత్ మరియు తేజస్విని తల్లిదండ్రులు ఇద్దరు బడా వ్యాపారస్తులే..