తెలుగు ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్లలో ఒకరైన కృతి శెట్టి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన వెంటనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. వరుస సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉంది ఈ అమ్మడు.
కానీ ఇండస్ట్రీలో కొంతమంది ఎన్ని సినిమాలు తీసినా స్టార్డం అనేది రావడం చాలా కష్టం. కానీ కృతి మాత్రం ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.
2021 వచ్చిన “ఉప్పెన” సినిమాతో ఓవర్ నైట్ లో మంచి హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన నటించి ఇండస్ట్రీ మొత్తం తన వైపు తిప్పుకుంది ఈ అమ్మడు. ఈ సినిమా సక్సెస్ కావడంతో వరుస అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. ఈ తరుణంలోనే బంగార్రాజు సినిమా ద్వారా మరొక సక్సెస్ కొట్టింది.
దాని వెంటనే హీరో నానితో శ్యాం సింగరాయ్ సినిమాలో నటించి సక్సెస్ ఫుల్ కథానాయికగా మారింది కృతి. ఇదే స్ఫూర్తితో మరెన్నో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే హీరో సూర్యా 41వ సినిమాలో ప్రస్తుతం నటిస్తోంది. ఈ క్రమంలోనే కృతి శెట్టి ఒక ఇంటర్వ్యూకు హాజరైంది. ఆమె ఇంటర్వ్యూ చేసింది ఫ్రాంక్ స్టార్లు ఆశిక్ మరియు సారథిరన్. ఈ సందర్భంలో వారిద్దరూ ప్రశ్నలు నేను అడుగుతాను అంటే కాదు నేను అడుగుతాను అనుకుంటూ ఒకరిపై ఒకరు తీవ్రంగా అరుచుకుంటూ కేకలు వేస్తూ ఆమె ముందే కొట్లాటకు దిగారు.
అసలు అక్కడ ఏం జరుగుతుందో కృతి శెట్టికి అర్థం కాక భయంతో ఏడవసాగింది. చివరికి వారిద్దరూ గొడవను ఆపి ఇదంతా ఫ్రాంక్ అంటూ నవ్వుతూ చెప్పారు. దీంతో ఆమె ఊపిరి పీల్చుకుంది. ఇంటర్వ్యూలో కూడా ఆ తర్వాత తన దుఃఖాన్ని ఆపుకోలేక లైవ్ లోనే కన్నీరు పెట్టింది. దీంతో ఆ యాంకర్లు ఆమెను ఓదార్చరు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారడంతో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10