ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా రమ్యకృష్ణ, సౌందర్య ఒక వెలుగు వెలిగారు. ఆనాడు పది సినిమాలు రిలీజ్ అయితే అందులో దాదాపు ఎనిమిది సినిమాల్లో రమ్యకృష్ణ లేదా సౌందర్య మాత్రం తప్పనిసరిగా ఉండేవారు.
వారి నటన అందంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఈ తరుణంలో సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ నరసింహ కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కింది.
ఈ సినిమా ఆ సమయంలో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. సౌందర్య ఈ మూవీలో హీరోయిన్ పాత్ర లో నటించగా రమ్యకృష్ణ మాత్రం నెగిటివ్ రోల్ చేసింది. ఆనాడు రమ్యకృష్ణకు మంచి నటిగా మరింత పేరు తెచ్చిన పాత్రల్లో ఈ సినిమాలోని నీలాంబరి పాత్ర అని కూడా చెప్పవచ్చు. అయితే ఈ మూవీలో సౌందర్య ముఖంపై రమ్యకృష్ణ కాలు పెట్టే సీన్ ఉంటుంది.
అయితే ఈ సినిమాకు సంబంధించి ఎన్నో రూమర్లు బయటకు వచ్చాయి. మూవీ దర్శకుడు కేఎస్ రవికుమార్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మూవీ గురించి షాకింగ్ విషయాలను తెలియజేశారు. నరసింహ చిత్రంలో ముందుగా నగ్మాను నీలాంబరి పాత్రకోసం ఎంపిక చేశామని అన్నారు. దీని తర్వాత మీనాని కూడా అనుకున్నామని కొన్ని కారణాల వల్ల రమ్యకృష్ణను ఎంపిక చేయాల్సి వచ్చిందని కె.ఎస్.రవికుమార్ తెలియజేశారు.
రమ్యకృష్ణ తాను అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసినప్పటి నుండి తెలుసని రవికుమార్ చెప్పుకొచ్చారు. అయితే రమ్యకృష్ణ, సౌందర్య ముఖంపై కాలు పెట్టే సీన్ చేయాలని చెప్పగానే రమ్యకృష్ణ మాత్రం ఆ సీన్ చేయనని రవి కుమార్ కు చెప్పరట. అయితే సౌందర్య మార్కెట్ ఎక్కువ అని నా మార్కెట్ తక్కువ అని రమ్యకృష్ణ చెప్పారట. కానీ సౌందర్య మాత్రం నువ్వే చెయ్యాలి.
అంటూ ఆమె కాళ్లు తన ముఖం పై పెట్టుకున్నారని కె.ఎస్.రవికుమార్ వెల్లడించారు. కానీ రమ్య కృష్ణ ఆ సమయంలో ఏడ్చారని కామెంట్ చేశారు. ఆ షాట్ రియల్ అని కె.ఎస్.రవికుమార్ తెలియజేశారు. అందులో రమ్యకృష్ణ సౌందర్య నటించారని డుప్ ఏమీ లేదని రవికుమార్ అన్నారు. ఈ మూవీ కె.ఎస్.రవికుమార్ సినీ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ అయిందని ఆయన అన్నారు.