సినీ నటులు చాలామంది ఎంత ఎక్కువ వయసు ఉన్నా చిన్నపిల్లల్లా కనిపిస్తూ ఉంటారు. ఈ విధంగానే టాలీవుడ్ నటి స్టార్ హీరోయిన్ భూమిక కూడా అందులో భాగమే. మొట్టమొదటిసారి యువకుడు మూవీతో సినీ ఇండస్ట్రీకి వచ్చిన ఈ బ్యూటీ పవన్ కళ్యాణ్ ఖుషి సినిమాలో నటించి స్టార్ హీరోయిన్ అయిపోయింది అని చెప్పవచ్చు.
ఈ సినిమా రిలీజ్ అయి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా ఆ మూవీలోని సన్నివేశాలు గానీ, మాటలు గానీ, పాటలు గానీ అభిమానులు మర్చిపోలేదు అంటే మూవీ ఎంత హిట్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఒక్క మూవీ భూమిక సినీ కెరీర్ నే మార్చేసింది. ఈ మూవీ తర్వాత వరుసగా సినిమాల్లో నటిస్తూ వెనక్కి తిరిగి మాత్రం చూసుకోలేదు. అలా కొద్ది రోజులు ఇండస్ట్రీలో ఆమె హవా కొనసాగింది.
కేవలం తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా హిందీ, తమిళ్, కన్నడ ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. దీని తర్వాత కొద్దిరోజులు ఇండస్ట్రీకి దూరమై ఇటీవల కాలంలోనే మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది భూమిక. ప్రస్తుతం సినిమాల్లో ఆమె వదినే, అక్క ఇలాంటి పాత్రల్లో నటిస్తోంది. యోగా ట్రైనర్ భరత్ ఠాకూర్ ను వివాహం చేసుకొని విడిపోయిన తర్వాత భూమిక మళ్లీ తన సినిమా కెరీర్ ను డెవలప్ చేసే ప్రయత్నంలో ఉంది.
ఒకప్పటి లాగా అంత బిజీగా లేకపోయినా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రం రాణిస్తోంది. ప్రస్తుతం భూమిక 40 సంవత్సరాల వయసులో కూడా హాట్ ఫోటోలతో కుర్రకారుకు చమటలు పట్టిస్తూ పదహారేళ్ళ పిల్లల కనిపిస్తోంది. తాజాగా బ్లాక్ కలర్ పొట్టి డ్రెస్ లో అదరగొట్టింది. ఈ డ్రెస్ లో 16 ఏళ్ల పిల్లల స్లిమ్ లుక్ అందరి మనసు దోచేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.