తెలుగు ఇండస్ట్రీ లో అక్కినేని కుటుంబం అంటే చాలా పేరున్న కుటుంబం. ఇండస్ట్రీలో కూడా మంచి గౌరవం కలిగిన కుటుంబం అని చెప్పవచ్చు.
వీరి కుటుంబంలో అక్కినేని నాగేశ్వరరావు నుంచి అఖిల్ వరకు హీరోగా పరిచయమై తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పాటు చేసుకున్నారు. నాగేశ్వరరావు కుమారుడు నాగార్జున మాత్రం స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్నారు. అయితే నాగార్జున భార్య అమల కూడా మొదట్లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకొని నాగార్జున వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమై పోయింది. అమల నాగార్జున కు రెండవ భార్య. ఆయన అంతకు ముందే లక్ష్మీ దగ్గుబాటి ని పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికి నాగచైతన్య పుట్టారు.. తర్వాత నాగార్జున అమల ని పెళ్లి చేసుకుంటే అఖిల్ పుట్టాడు. అయితే ప్రస్తుతం నాగార్జున తో పాటుగా అక్కినేని నాగచైతన్య అఖిల్ కూడా చాలా సినిమాలతో బిజీగా ఉన్నారు. కానీ అఖిల్,నాగచైతన్య స్టార్ హీరో పేరు సంపాదించుకోలేక పోతున్నారు. నాగ చైతన్య దానికి దగ్గరలో ఉన్నా ఇంకా సమయం పట్టేలా ఉంది. ఈ క్రమంలో నాగచైతన్య గురించి అమల చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను తెలియజేసింది. నాగ చైతన్య తన తల్లి లక్ష్మీ దగ్గరే పెరిగారని, అప్పుడప్పుడు తండ్రి వద్దకు వచ్చి సమయాన్ని గడిపే వాడని ఇటీవల మాతృ దినోత్సవం సందర్భంగా ఈ విషయాలను తెలియజేసింది. నాగ చైతన్య సెలవుల్లో మాత్రమే హైదరాబాద్ కి వచ్చే వాడిని, తను నాగచైతన్యని పెంచలేదని. అతను మొత్తం చెన్నైలో పెరిగాడని చెప్పుకొచ్చింది. వాళ్ళ అమ్మ చైతన్యను చాలా పద్ధతిగా పెంచిందని, రెండు మూడు నెలలకు ఒకసారి చైతన్య హైదరాబాద్ వచ్చి తన తండ్రితో గడిపేవాడిని ముచ్చటించింది. చైతన్య వచ్చినప్పుడు అఖిల్ తన వెంట అన్నయ్య అన్నయ్య అంటూ తిరిగే వాడని, చైతన్య ఇక్కడికి వస్తే అఖిల్ నన్ను కూడా మర్చి పోయేవాడని ఇద్దరు కలిసి సరదాగా ఆడుకొనే వారని తెలియజేసింది. వీరిద్దరిలో అఖిల్ బాగా అల్లరి చేసే వాడని, చైతన్య మాత్రం సైలెంట్ గా ఉండేవారని తెలియజేసింది అమల.
https://telugustop.com/akkineni-amala-intresting-comments-about-nagachaithanya-for-his-behavior