టైం తో పాటు అన్ని మారుతాయి. ఇది తెలిసిన విషయమే. టీవీ షోస్ ఫార్మాట్ కూడా చాలానే మారింది. చాలా కొత్త ప్రోగ్రామ్స్ వచ్చాయి. వస్తున్నాయి కూడా. ఇంక టీవీ సీరియల్స్ సంగతి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. కొన్ని సీరియల్స్ అయితే రెండు రకాలుగా పాపులర్ అవుతాయి. ఒకటేమో ఎక్కువ మంది ప్రేక్షకులు చూడటం ద్వారా టీఆర్పీ లు ఎక్కువగా రావడం ద్వారా వచ్చే పాపులారిటీ. ఇంకొకటి ఏమో సోషల్ మీడియాలో ట్రోలింగ్ ద్వారా వచ్చే పాపులారిటీ.
ఏదైతే ఏంటి సీరియల్స్ అయితే పాపులర్ అవుతున్నాయి. ఇప్పుడు అంటే సీరియల్స్ ని ట్రోల్ చేస్తున్నారు కానీ అంతకుముందు చిన్న వాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకూ అందరూ సీరియల్స్ చూసేవారు. ఇప్పటికీ మనలో చాలా మందికి మన చిన్నప్పటి సీరియల్స్ టైటిల్ సాంగ్స్ కొన్నయినా గుర్తుండే ఉంటాయి. డబ్బింగ్ సీరియల్స్ కి కూడా మామూలు క్రేజ్ ఉండేది కాదు.
అప్పుడు సీరియల్స్ లో మనల్ని అలరించిన ఎంతోమంది ఇప్పుడు సపోర్టింగ్ యాక్టర్స్ గా ఎన్నో సినిమాల్లో కనిపిస్తూ ఉంటారు. అలా డైరెక్ట్ తెలుగు సీరియల్స్ ద్వారా, డబ్బింగ్ సీరియల్స్ ద్వారా పాపులర్ అయిన నటి కావేరి. కావేరీ అంటే చాలా మందికి గుర్తు రావడం కష్టమే. స్నేహ సీరియల్ లో స్నేహ, మెట్టెల సవ్వడి సీరియల్ లో ధనలక్ష్మి అంటే చాలా మందికి గుర్తొస్తారు.
కావేరి ఎన్నో తమిళ్ సీరియల్స్ తో పాటు కొన్ని తెలుగు సీరియల్స్ లో నటించారు. అంతకు ముందు సినిమాల్లో కూడా నటించారు కావేరి. 1990 లో ఒక తమిళ సినిమాతో కెరీర్ మొదలు పెట్టారు కావేరీ. తర్వాత 2 తమిళ్ సినిమాలు చేశారు. అదే సంవత్సరంలో జగపతి బాబు హీరోగా వచ్చిన చిన్నారి ముద్దుల పాప అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టారు కావేరి.
తర్వాత కొన్ని తమిళ సినిమాలతో పాటు 1992 లో సాహసం అనే తెలుగు సినిమా చేశారు. కావేరి నటించిన మొదటి సీరియల్ ఈటీవీ లో టెలికాస్ట్ అయిన స్నేహ. తర్వాత తమిళ్ సీరియల్స్ లో చేశారు. అలాగే తెలుగులో అంతరంగాలు సీరియల్ లో కూడా నటించారు.
కావేరి చివరిగా 2013 నుండి 2017 వరకు టెలికాస్ట్ అయిన వంశం అనే తమిళ్ సీరియల్ లో నటించారు. 2013 లో కావేరి కి రాకేష్ అనే ఒక వ్యాపారవేత్తతో వివాహం జరిగింది. రాకేష్ కి చెన్నైలోని వెలచెరిలో ఒక ఫార్మస్యూటికల్ ఏజెన్సీ ఉంది. ప్రస్తుతం కావేరి ఇలా ఉన్నారు.