మనం ఏదైనా మంచి పని చేయాలంటే ఈ రోజు ముహూర్తం చూస్తాం. ఏ సమయములో మనకి ముహూర్తం కలిసివస్తుందో ఆ టైం లోనే ఆ పనులను చేస్తే బాగుంటుందని నమ్ముతాం. ఆధ్యాత్మిక నిపుణులు చెప్పిన ప్రకారం కొన్ని రాశుల వారికి మే 14వ తేదీ వరకు అన్నీ లాభాలే కలుగుతాయి. మరి వారు ఎవరో తెలుసుకుందామా..!!
జ్యోతిషశాస్త్రం ప్రకారం చూస్తే సూర్యునికి ప్రత్యేక స్థానం ఉంటుంది. గ్రహాలకు రాజు అని అంటారు. మీ జాతక చక్రంలో శుభప్రదమైన స్థానంలో ఉంటే ఆయా రాశుల వారికి చాలా అదృష్టం ఉంటుంది.
మేషరాశి : ఈ రాశి వారికి ఆదాయం రెట్టింపు అవుతుంది. సంగీతం కళల పట్ల ఆసక్తి కూడా పెరుగుతుంది. స్థానచలనం జరిగే అవకాశం ఎక్కువ. కుటుంబంతో ఆనందంగా ఉంటారు. వారి యొక్క పిల్లల నుండి శుభ వార్తలను వింటారు. ఉద్యోగం చేస్తున్న వారైతే ప్రమోషన్లు పొందుతారు. కొత్త వాహనాలు కొంటారు.
కర్కాటకరాశి : వారి కుటుంబంలో మతానికి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతాయి. సంతానంలో మంచి ఫలితాలు ఉంటాయి. విదేశాలు ఉన్నత విద్య లాంటి వాటిలో మంచి అవకాశాలు వస్తాయి. మనసు ప్రశాంతత సంతోషం ఆత్మవిశ్వాసంతో ఉంటారు.
మీనరాశి : విద్యకు సంబంధించిన విషయాల్లో మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగం చేసేవారైతే పై అధికారుల మద్దతు పొందుతారు. స్థానచలనం జరగవచ్చు. ఆర్థికంగా ఎదుగుతారు ధన లాభం ఎక్కువగా ఉంటుంది. ఇతర ప్రదేశాలకు వెళ్ళవలసి రావచ్చు. స్నేహితుల నుండి మంచి మద్దతు లభిస్తుంది.
సింహరాశి : ఈ రాశివారు దుస్తులు మరియు వస్తువులపై ఎక్కువగా ఆసక్తిని కలిగి ఉంటారు. చదువు విషయంలో మంచి ఫలితాలను పొందుతారు. సంతానం విషయంలో మంచి వార్తలు వినే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి. తల్లిదండ్రుల నుంచి మద్దతు లభిస్తుంది.