మనం ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే లేదా ఆపద వచ్చినప్పుడు ట్రైన్ లోని అత్యవసర చైను లాగవచ్చు. మనం చైన్ లాగడం ఈజీ గానే ఉంటుంది కానీ, అలా లాగిన తర్వాత రైల్వే అధికారులు ఎలాంటి పనులు చేయాలో మీకు తెలుసా. ఒకవేళ ఆ రైలు బ్రిడ్జి పై వెళ్తున్నప్పుడు చైన్ లాగితే లోకో పైలట్ లు ఎంత సాహసం చేయాలో మీకు తెలుసా.. అవి ఏంటో తెలుసుకుందాం..?
ట్రైన్ వెళ్తున్నప్పుడు చైన్ లాగితే ట్రైన్ నిలిచిపోతుంది. మళ్లీ ట్రైన్ ముందుకు వెళ్లాలంటే అందులో ఉండే లోకో పైలట్ అది ఏ భోగిలో లాగారు. ఆ బోగి కిందికి వెళ్లి ఆ బొగి కింద ఉండే వ్యాక్యూమ్ సెట్ చేయవలసి ఉంటుంది. ఉత్తరప్రదేశ్ లోని సహరాన్పూర్ లో ఒక వంతెన పై రైలు నిలిచిపోయినప్పుడు లోకో పైలట్ సూర్యకాంత్ సింగ్ ఎదుర్కొన్న కష్టం అంతా ఇంతా కాదు. దాన్ని మాటల్లో కూడా చెప్పలేం.
ఏప్రిల్ 15వ తేదీన ఈ ఘటన చోటుచేసుకుంది. బోగీల మధ్య ఉండే అటాచ్మెంట్ వద్ద ఒక కప్లింగ్ ను తొలగించి లోకో పైలెట్ ఆ భోగి కిందకు చేరుకొని పట్టాలపై పాక్కుంటూ వెళ్లి వ్యాక్యూమ్ సెట్ చేస్తారు. అలాగే నెల్లూరు జిల్లాలోని పెన్నా వంతెన దగ్గర ఇటీవల ఒక ఆకతాయి చర్య వల్ల తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది. సీనియర్ లోకో పైలెట్ మృత్యుంజయ కుమార్ మిట్టమధ్యాహ్నం ప్రాణాలకు తెగించి వ్యాక్యూమ్ ను సెట్ చేశారు.
మృత్యుంజయ సాహసాన్ని మెచ్చుకున్న దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జై ఆయనకు అవార్డు ఇచ్చి సత్కరించారు. ఈ విధంగా రైల్లో చైన్ లాగితే లోకో పైలెట్లు ప్రాణాలకు తెగించి ఏవిధంగా కాపాడతారు చూసారు కదా.. ఒకవేళ లోకో పైలెట్ అందుబాటులో లేకపోతే రైల్వే శాఖకు గంటకు 20 లక్షల రూపాయల నష్టం వాటిల్లుతుందని రైల్వేశాఖ చెబుతుంది.
watch video:
watch video: