హైదరాబాద్ అశోక్ నగర్ గర్ల్స్ హాస్టల్లో ఆ-త్మ-హ-త్య చేసుకున్న వరంగల్ విద్యార్థి ప్రవళిక కేసులో బిగ్ ట్విస్ట్ వచ్చింది. ప్రవల్లిక చనిపోవడానికి ప్రేమ వ్యవహారమే కారణమని కుటుంబ సభ్యులు తెలియజేశారు.
తమ కుమార్తె మృతికి శివరామే కారణమని అతని వేధింపుల వల్లే ఆ-త్మ-హ-త్య చేసుకుని చనిపోయిందని ఆరోపించారు. శివరామ్ కు ఉ-రి-శి-క్ష వేయాలని ఆమె తల్లి సోదరుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అయితే గ్రూప్ టూ ఎగ్జామ్ ఆలస్యం కావడం వల్లే ప్రవల్లిక ఆ-త్మ-హ-త్య చేసుకుంది అంటూ కొద్దిరోజులుగా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలలో నిజం లేదని తేల్చి చెప్పారు. తమ కుటుంబాన్ని రాజకీయాలకు లాగవద్దని వేడుకుంటున్నారు. శివరామ్ వేరే అమ్మయి ద్వారా తన అక్కని పరిచయం చేసుకుని తనకి ఇష్టం లేకపోయినా ప్రేమ పేరుతో వే-ధిం-పు-ల-కు గురి చేశాడని ప్రవళిక సోదరుడు తెలిపాడు. ఫోన్లు చేసి ఏడిపించడం హాస్టల్ వద్దకు వచ్చి ఇబ్బంది పెట్టడం వంటివి చేసేవాడని ఎవరికి చెప్పుకోవాలో తెలియక డిప్రెషన్ కి కూడా తన అక్క ఆ-త్మ-హ-త్య చేసుకుందని అన్నాడు
కూలి నాలి చేసుకుని తన బిడ్డలను చదివించుకుంటున్నానని తమకి రాజకీయాలతో సంబంధం లేదని తమ బిడ్డకి అన్యాయం చేసిన వాడిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని ప్రవళిక తల్లి డిమాండ్ చేసింది.రాజకీయ పార్టీల వారు మీ గొడవల్లోకి మమ్మల్ని లాగొద్దని ప్రవల్లిక తల్లి వేడుకుంది. తమకి తమ బిడ్డకి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. తమని అది చెప్పండి ఇది చేయండి అని ఎవరు ఇబ్బంది పెట్టవద్దని వేడుకుంది.