శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి ల కాంబో లో వస్తున్న సినిమా ‘లవ్ స్టోరీ’. ఈ సినిమా గత ఏప్రిల్ లోనే విడుదల చేయాల్సి ఉండగా కరోనా కారణంగా థియేటర్స్ మూత పడటం, ఏపీ లో టికెట్ వ్యవహారం మొదలగు కారణాల వలన చిత్రం ఆలస్యం అవుతూ వస్తుంది. ఇక మొత్తానికి వినాయక చవితికి విడుదల చేస్తున్నాం అంటూ ప్రకటించారు.
మరో మారు వాయిదా పడి ఇక ఎట్టకేలకు సెప్టెంబర్ 24 న విడుదల అవ్వనుంది ఈ సినిమా. సినిమా లోని సాంగ్స్ కి ఇప్పటికే భారీ రెస్పాన్స్ వచ్చింది. దీనితో సినిమా పై హోప్స్ పెంచేసింది. ఈసినిమా కి సంబదించిన ట్రైలర్ ఇవాళ విడుదల చేసారు చిత్ర యూనిట్. సారంగా దారియా పాటకి మిలియన్ల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి.