మెగా స్టార్ హీరో గా మలయాళం సూపర్ హిట్ సినిమా ‘లూసిఫెర్’ తెలుగు లో గాడ్ ఫాదర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా. ఇటీవలే షూటింగ్ ని ప్రారంభించారు చిత్ర యూనిట్. ఈ సినిమాకి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. రాజకీయాల నేపథ్యంలో సాగే ఈ కథ సినిమలో వచ్చే ట్విస్టులు, కథనం హై లైట్ గా నిలుస్తాయి అంటున్నారు.
ఇక ఈ సినిమా గురించి ఒక ఆసక్తి కరమైన విషయం బయటికి వచ్చింది. అదేంటంటే చిరు సరసన పలు సూపర్ హిట్ సినిమాలలో నటించిన సీనియర్ యాక్ట్రెస్ ‘శోభన’ గారు ఒక ప్రత్యేక పాత్ర కోసం ఎంపిక చేసినట్టు సమాచారం. మలయాళం లో మంజు వారియర్ చేసిన ఈ పాత్ర కోసం నటి శోభన గారిని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది.
చిరు తో ‘రౌడీ అల్లుడు’, ‘రుద్ర వీణ’ వంటి సూపర్ హిట్ సినిమాలలో నటించారు శోభన గారు. తెలుగు లో గతంలో 2006 లో మంచు విష్ణు నటించిన ‘గేమ్’ సినిమాలో నటించారు శోభన అటు తరువాత తెలుగు సినిమాలలో ఎక్కడ కనిపించలేదు. ఈ విషయమై మరికొన్ని రోజులలో అధికారిక ప్రకటన రానుంది.