కొందరు వయస్సుతో సంబంధం లేకుండా వికృత చేష్టలు చేస్తూ ఉంటారు. ఆరు పదుల వయస్సులో ఉన్న కూడా వారిలోని కామాంధులు నిద్రలేస్తూ ఉంటారు. అలా వారు చేసే పనులు సమాజం తలదించుకునే విధంగా ఉంటాయి. తాజాగా అక్టోబర్ 29న బెంగళూరులో లూలూ షాపింగ్ మాల్ లో ఒక 60 ఏళ్ల వ్యక్తి ఒక యువతిని వెనకనుంచి తాకుతూ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన సిలికాన్ సిటీ తో పాటు దేశవ్యాప్తంగా విమర్శలకు దారితీసింది.
ఈ ఘటన పైన నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. పోలీసులు విచారణ జరిపి ఆ వ్యక్తి రిటైర్డ్ ప్రిన్సిపల్ అశ్వత్ నారాయణ గా గుర్తించారు.
అప్పటి నుండి పరారీలో ఉన్న అతను నేరుగా బెంగళూరులో కోర్టుకు వెళ్లి సరెండర్ అవడం వెంటనే బెయిల్ తీసుకోవడం గమనార్హం. అయితే సదరు పెద్దమనిషి వెకిలి చేష్టలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండడంతో మాగడి పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. వారంతరాల్లో మాల్స్ కి వెళ్లి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం అతని నైజాం అని గుర్తించారు. నిందితున్ని విచారణ చేపట్టారు.
నీ వయస్సు ఏంటి నువ్వు చేసే పనులు ఏంటి అంటూ నెటిజన్లు అతనిపై విరుచుకుపడుతున్నారు. ఇలాంటి వారిని ఊరికే వదలకూడదు అంటూ కామెంట్లు పెడుతున్నారు. మనవరాలు వయసున్న పిల్లలతో ఏంటి ఆ చేష్టలు, ఇలాంటి బారి నుండి తల్లిదండ్రులు తమ పిల్లలను జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచిస్తున్నారు. జనసంద్రం ఎక్కువగా ఉన్నచోటు లో ఇలాంటి వారు అదే పనిగా తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉంటారని చెబుతున్నారు. ప్రిన్సిపల్ అయ్యుండి ఇలాంటి పనులు చేయడం ఉపాధ్యాయ వృత్తికే సిగ్గుచేటుగా వర్ణిస్తున్నారు.
Also Read:భర్త సడన్ ఎంట్రీ…కూలర్ లో ప్రియుడిని దాచిన భార్య..చివరికి ఏమైందంటే.?