మహేష్ బాబు. ఎటువంటి పరిచయం అవసరం లేని వ్యక్తి. సూపర్ స్టార్ కృష్ణ గారి కొడుకు మహేష్ బాబు గా నీడ అనే సినిమా లో నటించారు. తర్వాత తండ్రితో కలిసి పోరాటం, శంఖారావం, బజార్ రౌడీ, ముగ్గురు కొడుకులు, గూడచారి 117, కొడుకు దిద్దిన కాపురం, అన్న తమ్ముడు, బాలచంద్రుడు సినిమాల్లో మహేష్ బాబు ఫొటోస్ చైల్డ్ ఆర్టిస్ట్ గా మహేష్ బాబు ఫొటోస్నటించారు.
తర్వాత తొమ్మిదేళ్ల విరామం. ఆ సమయంలో తన చదువును పూర్తి చేశారు. 1999లో రాఘవేంద్ర రావు గారి దర్శకత్వంలో వచ్చిన రాజకుమారుడు తో హీరోగా మళ్లీ మనందరినీ పలకరించారు. ఆ సినిమా తర్వాత ప్రేక్షకులు కూడా మహేష్ బాబుని ప్రిన్స్ మహేష్ బాబు అని పిలిచారు.
రాజకుమారుడు సినిమా పెద్ద హిట్. ఆ తర్వాత 2000 సంవత్సరం లో యువరాజు సినిమా చేశారు. ఆ సినిమా యావరేజ్ గా నిలిచింది. తర్వాత వచ్చిన సినిమా వంశీ. వంశీ అనుకున్నంతగా ఆడలేదు. కానీ ఆ సినిమాతో రీల్ జంట తర్వాత రియల్ జంట అయ్యారు.
మురారి సినిమా మహేష్ బాబు లో ఉన్న నటుడిని ఆవిష్కరించింది. తర్వాత వచ్చిన టక్కరిదొంగ ఫ్లాప్ అయింది. ఆ తర్వాత వచ్చిన బాబి కూడా సరిగా ఆడలేదు. సరిగ్గా అప్పుడు వచ్చింది ఒక్కడు. ఈ సినిమాతో మహేష్ బాబు డైలాగ్ డెలివరీ మారింది. స్టైల్ మారింది. అంతకుముందు మురారి లో చూసిన మహేష్ బాబు ఇతనేనా? అని అనిపించింది. మహేష్ బాబు కి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చింది. తర్వాత వచ్చిన నిజం, నాని వేటికవే భిన్నంగా ఉంటాయి.
నిజం సినిమా లో మహేష్ బాబు నటన కు ఎన్నో ప్రశంసలు దక్కాయి. ఆ సినిమా ఫ్లాప్ అయినా కూడా మహేష్ బాబు నటించిన సినిమాల్లో బెస్ట్ సినిమాల జాబితా చేస్తే నిజం సినిమా ఖచ్చితంగా ఉంటుంది. అర్జున్, అతడు సినిమాల్లో కూడా తన నటనను మరోసారి నిరూపించుకున్నారు మహేష్ బాబు. మహేష్ బాబు ఫొటోస్తర్వాత వచ్చిన పోకిరి మళ్లీ మహేష్ బాబు లోని మరొక కొత్త కోణాన్ని ఆవిష్కరించింది.
1) మహేష్ బాబు ఫ్యామిలీ
సైనికుడు, అతిథి చిత్రాలు ఆడలేదు. దాంతో దాదాపు మూడు సంవత్సరాలు బ్రేక్ తీసుకున్నారు. మధ్యలో జల్సా సినిమా కి వాయిస్ ఓవర్ కూడా ఇచ్చారు. 2010లో ఖలేజా తో మళ్లీ మన ముందుకు వచ్చారు. ఇందాక పైన చెప్పిన మహేష్ బాబు బెస్ట్ సినిమాల జాబితాలో ఈ సినిమా కూడా ఉంటుంది. ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందో ఇప్పటికీ ఎవరికీ అర్థం కాదు.
ఖలేజా సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవలసింది మహేష్ బాబు కామెడీ టైమింగ్ గురించి. ఈ సినిమాతో మహేష్ బాబు కామెడీ టైమింగ్ అందరికి తెలిసింది. ఇంకొక విషయం ఏంటంటే ఈ సినిమా సమయంలో త్రివిక్రమ్ కి అసిస్టెంట్ గా వ్యవహరించారట మహేష్ బాబు. తర్వాత వచ్చిన దూకుడు సినిమాతో మహేష్ బాబు కామెడీ టైమింగ్ మళ్ళీ రుజువైంది.
మహేష్ బాబు కెరియర్ లో ఆగడు, బ్రహ్మోత్సవం లాంటి సినిమాలు ఉన్నాయి. వన్ నేనొక్కడినే, బాబి, నాని, నిజం, స్పైడర్, ఖలేజా వంటి ప్రయోగాత్మక చిత్రాలు ఉన్నాయి. బిజినెస్ మాన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు ఇలాంటి హిట్ సినిమాలు ఉన్నాయి.
21 ఏళ్ల సినీ కెరీర్ లో ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాకూడా అవన్నీ దాటుకొని వచ్చి సూపర్ స్టార్ మహేష్ బాబు గా ఎంతోమంది ప్రేక్షకుల మనసుల్లో స్థానాన్ని, ఇండస్ట్రీలో గుర్తింపును సంపాదించుకున్నారు.
వెయ్యికి పైగా హార్ట్ ఆపరేషన్లు చేయించి, రెండు గ్రామాలను దత్తత తీసుకొని వాటిని అభివృద్ధి చేస్తూ సామాజిక సేవలో కూడా తన వంతు సహాయాన్ని అందిస్తున్నారు. భవిష్యత్తులో కూడా మహేష్ బాబు ఎన్నో గొప్ప సినిమాలు చేయాలి అని ఆశిస్తూ సూపర్ స్టార్ మహేష్ బాబు అన్ సీన్ పిక్చర్స్ కొన్ని ఇప్పుడు చూద్దాం.
#1 మహేష్ బాబు ఫ్యామిలీ
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
#19
#20
#21
#22
#23
#24
#25
#26
#27
#28
#29
#30
#31
#32
#33
#34
#35
#36
#37
#38
#39
#40
#41
#42
#43
#44
#45
#46
#47
#48
#49
#50
#51
#52
#53
#54
#55
#56
#57
#58
#59
#60
#61
#62
#63
#64
#65
#66
#67
#68
#69
#70
#71
#72
#73
#74
#75
#76
#77
#78
#79
#80
#81
#82
#83
#84
#85
#86
#87
#88
#89
#90
#91
#92
#93
#94
#95
#96
#97
#98
#99
#100
#101
#102
#103
#104
#105
#106
#107
#108
#109
#110
#111
#112
#113
#114
#115
#116
#117
#118
#119
#120
#121
#122
#123
#124
#125
#126
#127
#128
#129
#130 మహేష్ బాబు ఫొటోస్
#131
#132
#133
#134
#135
#136
#137
#138
#139
#140 Mahesh Babu family Photos and details
#141
#142 Mahesh Babu family Photos and details
#143 Mahesh Babu Family Photos
#144
#145 Mahesh Babu Family Photos
#146