దేశంలో ప్రతిరోజు ఏదో ఒక మూలన మహిళలు వేధింపులకు గురవుతూ ఉంటారు. ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని కఠిన శిక్షలు విధించిన కూడా పోకిరిలు తమ వంకర బుద్ధిని మార్చుకోరు. అవకాశం దొరికినప్పుడల్లా మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించి ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. మనం ఇలాంటి ఘటనలు రోజు వింటూనే ఉంటాం. టీవీలలో, ఫోన్లలో చూస్తూనే ఉంటాం.
చాలామంది తిరగబడే ధైర్యం లేక ఎవరికి చెప్పుకోలేక తమలో తామే ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే ఒంటరిగా మహిళలు ప్రయాణిస్తే అదే అదునుగా చాలా మంది మిస్ బిహేవ్ చేస్తారు.తాజాగా ఒక వ్యక్తి రైలులో మహిళను ఇబ్బందులకు గురి చేసిన ఘటన బయటకు వచ్చింది. దీంతో ఆ వ్యక్తికి సదరు మహిళా గట్టిగానే బుద్ధి చెప్పింది.
ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ వీడియో మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. పూర్తి వివరాలు చూస్తే రైలులో ఒక మహిళ ప్రయాణం చేస్తుంది. ఆమె పక్కనే ఒక వ్యక్తి వచ్చి కూర్చున్నాడు. ఆమెను అసభ్యంగా తాకుతూ అనుచితంగా ప్రవర్తించాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆ మహిళ ఆ వ్యక్తిని చెప్పు తీసుకుని చితకబాదింది. జుట్టు పట్టుకుని ఇష్టం వచ్చినట్టు కొట్టింది. అంతటితో ఆగకుండా అతని ప్రైవేటు పార్టులపైన కూడా చెప్పుతో కొట్టింది. దీంతో ఆమె దాడిని తట్టుకోలేని ఆ వ్యక్తి ఆ సీట్లో నుండి లేచి వెళ్లిపోయాడు. అయినా కూడా ఆగకుండా ఆ మహిళా సీటు పైకెక్కి మళ్ళీ చెప్పుతో కొట్టింది.
Kalesh b/w a Lady and a Guy inside Indian Railways over this guy was misbehaving with her
pic.twitter.com/JO9g16RVDZ— Ghar Ke Kalesh (@gharkekalesh) November 24, 2023
ప్రయాణికులు ఎంత సర్ది చెప్పినా కూడా ఆ మహిళ వినిపించుకోలేదు. దీంతో ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. మహిళలు ఇలా ధైర్యంగా ఉండాలని ఏదైనా ఘటన జరిగినప్పుడు సింహంలా తిరగబడాలని పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఆమె ధైర్యాన్ని మెచ్చుకోవాలి అంటూ ఎంకరేజ్ చేస్తున్నారు. కొందరైతే ఈ మగ వెదవలుకి బుద్ధి రాదా అంటూ కూడా కామెంట్లు పెడుతున్నారు.
Also Read:కార్తీక మాసం లో 365 వత్తులు ఎందుకు వెలిగిస్తారో తెలుసా..??