బిగ్ బాస్ తెలుగు రాష్ట్రాల్లో ఎంతో రేటింగు సంపాదించిన షో. ఈ షో వస్తుందంటే అందరు టీవీలకు అతుక్కు పోవాల్సిందే. ఈ షో ప్రేక్షకులకు ఆనందాన్ని ఇవ్వడమే కాకుండా, ఎంతోమంది కంటెస్టెంట్ ల కు మంచి వేదికగా ఆహ్వానం పలికింది. ఈ షో ద్వారా బయట ప్రపంచానికి పరిచయమైన చాలామంది ప్రస్తుతం బాగా సంపాదిస్తున్నారు. ఈ షోలో పరిస్థితుల ప్రభావం వల్ల ఎంతోమంది నటీనటులు ఫ్రెండ్స్ గా, లవర్స్ గా
ప్రేక్షకులను అలరించారు. అలా బిగ్ బాస్ హౌస్ లో ఏర్పడిన వారి బంధాలు బయటకు వచ్చాక కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారుతుంటాయి. అలాంటి ఓ జంటే మానస్, ప్రియాంక సింగ్. వీరు బిగ్బాస్ సీజన్ 5లో హౌస్ లో ఎంతో సన్నిహితంగా ఉన్నట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అయితే వీరు రీసెంట్ గా
మొదటిసారి బయట ప్రపంచంలో కూడా క్యూట్ లవ్ సాంగులు పాడుకుంటూ దర్శనమివ్వడం విశేషం.. మరి వారి మధ్య ఏముందో తెలుసుకుందామా..? అబ్బాయి నుండి అమ్మాయిగా మారినటువంటి ప్రియాంక సింగ్ తన కెరీర్ మొదట్లో రియాల్టీ షోలలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. తర్వాత ఆమె జబర్దస్త్ ద్వారా పేరు సంపాదించుకున్నా, బిగ్బాస్ సీజన్ 5లో మాత్రం చాలా క్రేజ్ పెరిగింది. అందులో చివరి
వరకు పోరాడి మంచి కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకుంది. హౌస్ లో కూడా ఆమె ఇతర కంటెస్టెంట్ లతో మంచి రిలేషన్ షిప్ కొనసాగించింది. ఇందులో ముఖ్యంగా ఆర్టిస్టు ప్రియతో కూడా బాండింగ్ ఏర్పడుతుంది. వీరిద్దరూ బయట తరచూ కలుస్తూనే ఉంటారు. తల్లీకూతుళ్ల మాదిరిగా ఉండే వీరు సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ హల్చల్ చేస్తారు.
మానస్ తో బాండింగ్ : హౌస్ లో ఉన్నప్పుడు ప్రియాంక సింగ్ ఎక్కువగా మనస్ తో అన్యోన్యత ఏర్పరచుకుంది. అతనిపై ఎంతగానో ఆకర్షణ పెంచుకున్న ప్రియాంక అప్పుడప్పుడు హద్దులు దాటి కూడా మాట్లాడింది. నా జీవితం అందరిలాగా ఉండి ఉంటే మాత్రం నీతో తప్పకుండా జీవితాన్ని పంచుకునే దాన్ని తెలియజేసిన. కానీ ప్రియాంకను మంచి స్నేహితురాలిగా మాత్రమే చూశారు. అయితే వీరు హౌస్ నుండి
బయటకు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ప్రియాంక సింగ్ మానస్ తో కలిసి ఒక లవ్ సీన్ రిల్ చేసింది. “అబ్బాయిలు స్మార్ట్ గా ఉండడం కంటే ఇన్నోసెంట్ గా ఉంటేనే బాగుంటారని”.. నాకు వాడి ఇన్నోసెంట్ అంటే ఇష్టం’.. అంటూ డైలాగ్ చెబుతున్న ప్రియాంకను చూసి మనస్ సిగ్గుపడి పోతున్నాడు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారింది.
https://www.instagram.com/reel/Cco_XIroe–/?utm_source=ig_web_button_share_sheet