Ashok Gajapathi Raju: పదవులు కావలి బాధ్యతలు పట్టించుకోవా? ఎంపీ విజయసాయి రెడ్డి ఫైర్ మాన్సాస్ ట్రస్టు చైర్మన్, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజుపై ఫైర్ అయ్యారు వైస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మాన్సాస్ ఆదీనం లో ఉన్న పన్నెండు విద్యాసంస్థల సిబ్బంది జీతాల గురించి ప్రశ్నించారు విజయ సాయి రెడ్డి.
Also Read : మళ్లీ పుష్ప సెట్లోకి అడుగుపెట్టిన సుకుమార్.!
బోర్డుని సమావేశపరచకుండా కాలయాపన చేస్తున్నారని నిధులుకరువై జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మీకు పదవులు కావలి, మరి బాధ్యతలు వద్దా అంటూ సూటిగా ప్రశ్నించారు అత్త మీద కోపం దుత్త మీద చూపిస్తే ఎలా అని మాటలు సంధించారు. ”పార్టీ లేదు…బొక్కా లేద’అచ్చన్న ఏనాడో అన్నారని పప్పు బాబు కి పొడుచుకు వచ్చిందని ఎద్దేవా చేసారు. అంతే కాదు టీడీపీ నేత నారా లోకేష్ మీద పరోక్షంగా విమర్శలు సంధించారు. సీట్లకే కాదు ఓట్ల కు కూడా బొక్క పడిందని మండిపడ్డారు.