ఒకప్పుడు అయితే బాలీవుడ్ సినిమాల లైన్స్ తీసుకుని, ఇక్కడి నెటివికి తగ్గట్టుగా సినిమాలు తీసేవారు టాలీవుడ్ డైరక్టర్స్. కానీ ప్రస్తుతం ట్రెండ్ మారిపోయింది. సౌత్ సినిమాల డామినేషన్ కూడా పెరిగింది. సౌత్ హీరోలు పాన్ – ఇండియన్ మూవీస్ చేస్తుంటే, ఇక్కడి కథలంటే బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు బాలీవుడ్ మేకర్స్.
అందులోనూ ఇక్కడి మాస్ సినిమాలంటే నార్త్ ఆడియెన్స్ కళ్లప్పగిస్తున్నారు. అందుకేనేమో ఒకటి కాదు రెండు చాలా సినిమాలను రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నారు బాలీవుడ్ మేకర్స్. మరి ఆ సినిమాలేమిటో చూద్దాం..
1. అపరిచితుడు
అపరిచితుడు 2005లో తెలుగు తమిళ భాషల్లో విడుదలై సంచలనం సృష్టించింది. ఇక ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. రణ్ వీర్ సింగ్ హీరోగా ఈ సినిమాని స్వయంగా శంకరే డైరెక్ట్ చేయబోతున్నాడు.
2. అల వైకుంఠపురములో
త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన `అల వైకుంఠపురములో` క్రేజీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది, ఈ మూవీ `షెహజాదా` పేరుతో రీమేక్ అవుతోంది. ఈ సినిమాలో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్నాడు.
3.డ్రైవింగ్ లైసెన్స్
పృథ్వీరాజ్ మరియు సూరజ్ వెంజరమూడు నటించిన మలయాళ కామెడీ-డ్రామా 2019 యొక్క అధికారిక హిందీ రీమేక్ “సెల్ఫీ”లో అక్షయ్ కుమార్ మరియు ఇమ్రాన్ హష్మీ నటించనున్నారు. 2023లో విడుదల కానున్న ఈ చిత్రానికి రాజ్ మెహతా దర్శకత్వం వహించనున్నట్టు సమాచారం.
4. ఖైదీ
కార్తి నటించిన బ్లాక్ బస్టర్ మూవీ `ఖైదీ` రీమేక్ అవుతోంది. ఈ సినిమాలో అజయ్ దేవగన్ నటిస్తున్నాడు.
5. ఆకాశం నీ హద్దురా
సూర్య సూపర్ హిట్ ఆకాశమే నీ హద్దురా సినిమా త్వరలోనే బాలీవుడ్ సెట్స్ పైకి వెళ్ళనుంది.ఇందులో అక్షయ్ కుమార్ హీరోగా నటించబోతున్నాడు.
6.వీరమ్
వీరమ్‌కి రీమేక్ గా వస్తున్న మూవీ కిసీ కి భాయ్ కిసీ కా జాన్. ఈ మూవీలో సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే, వెంకటేష్, జగపతి బాబు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అజిత్ నటించిన ఈ మూవీని తెలుగులో కాటమరాయుడుగా తీశారు. ఇందులో పవన్ కళ్యాణ్ నటించారు
7.యూ టర్న్
సమంత నటించిన యూటర్న్ సినిమాని ఏక్తాకపూర్ బాలీవుడ్ లో రీమేక్ చేస్తుంది.
8.ఎఫ్ 2 (ఫన్ అండ్ ఫ్రస్టేషన్)
బోనీకపూర్ ఎఫ్2 రీమేక్ రైట్స్ దక్కించుకున్నారు. అర్జున్ కపూర్ హీరోగా బాలీవుడ్ లో రీమేక్ చేయబోతున్నారు.వెంకటేష్ పాత్రను ఎవరు చేస్తారనేది తెలియాల్సి ఉంది.
9.నాంది
2021 తెలుగు హిట్ సినిమా నాంది. ఈ మూవీ కోసం అజయ్ దేవగన్ దిల్ రాజుతో కలిసి పని చేస్తున్నారు.గతంలో అజయ్ దేవగన్ రీమేక్ గురించి ట్వీట్ చేశాడు.
10.ఛత్రపతి
రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ఛత్రపతిని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. అయితే ఇందులో బెల్లంకొండ శ్రీనినాస్ హీరో, వివి వినాయక్ దర్శకత్వం చేస్తున్నారు.
11.మాస్టర్
తమిళ స్టార్ హీరో విజయ్ మరియు విజయ్ సేతుపతి నటించిన సినిమా ‘మాస్టర్’. ఈ మూవీ కూడా హిందీలో రీమేక్ చేస్తున్నారు.సల్మాన్ ఖాన్ టైటిల్ క్యారెక్టర్‌ను పోషిస్తాడని సమాచారం.
12. గ్రేట్ ఇండియన్ కిచెన్
‘నీస్ట్రీమ్’అనే ఓటిటిలో విడుదలైన విమర్శకుల ప్రశంసలందుకున్న మలయాళ సినిమా ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’. ఈ సినిమాకి జో బేబీ దర్శకుడు. ఈ మూవీ కూడా హిందీలో రీమేక్ చేస్తున్నారు.