నువ్వు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నావ్ అంట కదా? అనే ప్రశ్నకి ఎన్టీఆర్ సమాధానం ..!
సినిమా జీవితం వేరు రాజకీయాలు వేరు లాగ ఉంటాయి. రెండు వేరు వేరు ప్రపంచాలు సినిమాల్లో హీరోలుగా పేరుప్రఖ్యాతలు సంపాదించి రాజకీయాలలో హీరోలు గా ఎదిగిన వారు ఉన్నారు. రాజకీయాలలో వెళ్లి జీరోలుగా మారిన వారు ఉన్నారు. కానీ పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లో లోనే అధికారం లోకి వచ్చిన చరిత్ర మాత్రం కేవలం నందమూరి తారకరామా రావు గారికే చెల్లుతుంది. ఆయన సృష్టించిన ప్రభంజనం వేరు. కానీ ఇటీవల అన్న గారు స్థాపించిన టీడీపీ అధికారం కోల్పోవడం.
PAWAN KALYAN RANA MOVIE: మళ్ళీ షూటింగ్స్ తో బిజీ అవనున్న పవన్ కళ్యాణ్
RAM CHARAN SHANKAR MOVIE HEROINE : శంకర్ సినిమాలో రామ్ చరణ్ కి హీరోయిన్ సెట్ అయ్యింది!
ఎన్నడూ లేనన్ని తక్కువ స్థానాలకే టీడీపీ పరిమితం అవ్వడం అన్ని చూసాము. కాగా ఆ పార్టీ కార్యకర్తల్లో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో రావాలని తిరిగి టీడీపీ ని అధికారం లో నిలబెట్టాలని అభిమానులు, పార్టీ కార్య కర్తలు అంటున్న మాట. అయితే గతం లో జూనియర్ ఎన్టీఆర్ కూడా పలు సందర్బాల్లో సినిమాల పైనే తన ద్రుష్టి అని అటు వైపు తనకి ఆసక్తి లేదని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ జెమినీ టీవీ లో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ప్రోగ్రాం కి వ్యాఖ్యాతగా కనిపించబోతున్నారు. మొదటి ఎపిసోడ్ లో రామ్ చరణ్ ని గెస్ట్ గా ఒక ఎపిసోడ్ ని చిత్రికరించారు ఈ సందర్బంగా రామ్ చరణ్ ఈ ప్రశ్న అడిగారని తన ప్రశ్న కి సమాధానంగా కొంత సేపు వారి మధ్య చర్చ జరిగిందని కూడా చెబుతున్నారు. అయితే ఈ సంభాషణ మొత్తం ఎడిటింగ్ లో కట్ చేస్తున్నారని తెలిసింది. ఏది ఏమైనా ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై ఎప్పుడు ఆసక్తిగానే ఉన్నారు ప్రజలు.