అందరూ ఊహించినట్టుగానే ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘మీలో ఎవరు కోటీశ్వరులు’ షో రికార్డు స్థాయిలో టీఆర్పీ రేటింగ్స్ ని సాధించింది గత సీజన్లతో పోలిస్తే అత్యధికంగా ఈ షో 11.4 రేటింగ్స్ ని సాధించింది. రామ్ చరణ్ గెస్ట్ గా అటెండ్ అయిన మొదటి ఎపిసోడ్ తెలుగు రాష్ట్రాల ప్రజలని అలరించింది, ఆకట్టుకుంది. ఇక అటు తరువాత ప్రసారం అవుతున్న ఎపిసోడ్స్ కి కూడా చక్కటి స్పందన వస్తుంది.
ఇక మరో గెస్ట్ ఆర్ ఆర్ ఆర్ దర్శకులు రాజమౌళి గారిని ఈ షో కి గెస్ట్ గా తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నారు నిర్వాహకులు. దీనికి సంబంధించి అధికారికంగా త్వరలో వివరాలు వెల్లడించాన్నారు. ఎన్టీఆర్ గతం లో మాటీవీలో ప్రసారం అయ్యే బిగ్ బాస్ షో కి కూడా వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్ నటన, డాన్సులు, గానం, తో పాటుగా హోస్టింగ్ లో కూడా అయన చక్కటి ప్రదర్శన కనబరుస్తున్నారు. ఇక ఈ ‘మీలో ఎవరు కోటీశ్వరులు వీక్ డేస్ లో 5.6 రేటింగ్స్ గా వచ్చింది.
ఇవి కూడా చదవండి : “ఎవరు మీలో కోటీశ్వరులు” పేరు వెనుక ఇంత కథ ఉందా.?