‘ఆర్ ఆర్ ఆర్’ ఇప్పుడు ఇండియన్ సినిమా ప్రతి సినిమా అభిమాని ద్రుష్టి ఈ సినిమాపైనే ఉంది. అక్టోబర్ 13 న సినిమా విడుదలకి సన్నాహాలు చేస్తున్నారు అయితే ఈ సినిమా అక్టోబర్ లో కాకుండా 2022 విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్టు స్పష్టం అవుతుంది. జెమినీ టీవీలో నిన్న ప్రసారం అయిన ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోగ్రాంలో గెస్ట్ గా హాజరైన రామ్ చరణ్ హోస్ట్ గా ఎన్టీఆర్ ఇద్దరు అలరించారు ఈ సందర్బంగా వారిరువురు ఆర్ ఆర్ ఆర్ గురించి మాట్లాడుకున్నారు.
‘ఆర్ ఆర్ ఆర్’ లో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రని, రామ్ చరణ్ అల్లూరి సీతా రామరాజు పాత్రని చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సందర్బంగా రామ్ చరణ్ మాట్లాడుతూ ఆర్ ఆర్ ఆర్ విడుదల అయ్యాక అందరూ కొమరం భీం గురించే మాట్లాడుకుంటారంటూ చెప్పారు..ఆ విధంగా రాజమౌళి ఆ పాత్రలని తీర్చిదిద్దారని అదే విధంగా కొమరం భీం పాత్ర లో నటించడం తన పూర్వ జన్మ సుకృతమని ఎన్టీఆర్ చెప్పారు.