మెగా స్టార్ చిరంజీవి టాలీవుడ్ లో మళ్ళీ తన సినిమాల హవా ని పెంచారు, రీఎంట్రీ తరువాత సినిమాల జోరుని పెంచారు వరుసగా సినిమాలని ఒకే చేస్తూ మళ్ళీ బిజీ అయ్యారు. ఇక మెగా ఫాన్స్ కి బ్యాక్ తో బ్యాక్ సినిమాలని ఇస్తూ ఖుషి చేస్తున్నారు చిరు. ఖైదీ no 150 సినిమా తరువాత సైరా నరసింహ రెడ్డి, తరువాత ‘ఆచార్య’ సినిమా సెట్స్ పై ఉండగానే లూసిఫెర్ రీమేక్ గాడ్ ఫాదర్.
మెహెర్ రమేష్ తో ఒక సినిమా, డైరెక్టర్ బాబీ తో ఒక సినిమాని చేయబోతున్నారు చిరు. ఆచార్య సినిమా విడుదలకి ముస్తాబు అవుతుండగా, లూసిఫెర్ సెట్స్ పై ఉంది, ఇక మెహెర్ రమేష్ తో సినిమా ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు చిరు తమిళ రీమేక్ ఆధారంగా ‘వేదలమ్’ సినిమాని మెహెర్ రమేష్ తో చేయబోతున్నారు.
మెహెర్ రమేష్ ట్రాక్ చూస్తే అయన ఇచ్చిన డిజాస్టర్స్ ఎక్కువ ఉన్నాయి. అయిన కూడా ఇండస్ట్రీ లో ఉన్న అనుబంధాలతో ఎలాగోలా చిరు తో సినిమాని ఒకే చేసారు. ఇక ఈ సినిమాకి మెహెర్ రమేష్ నెలకి అయిదు లక్షల రూపాయల వరకు తీసుకుంటున్నారు. అంతే కాదు సినిమా లాభాల్లో 20 శాతం కూడా ఈయనకే అని టాక్.